Lalu Prasad: లాలూకు భారీ షాక్.. బెయిల్ పిటిషన్ ను సవాల్ చేసిన సీబీఐ...!

బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కు షాక్ తగిలింది. దాణా కుంభకోణం కేసులో ఆయనకు మంజూరు చేస్తూ జార్ఖండ్ కోర్టు ఇచ్చిన తీర్పును సీబీఐ సవాల్ చేసింది. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానంలో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ పై అగస్టు 25న విచారణ చేపట్టనున్నట్టు సుప్రీం కోర్టు వెల్లడించింది.

author-image
By G Ramu
New Update
Lalu Prasad: లాలూకు భారీ షాక్.. బెయిల్ పిటిషన్ ను సవాల్ చేసిన సీబీఐ...!

Lalu Prasad Yadav: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కు షాక్ తగిలింది. దాణా కుంభకోణం కేసులో ఆయనకు మంజూరు చేస్తూ జార్ఖండ్ కోర్టు (Jharkhand) ఇచ్చిన తీర్పును సీబీఐ (CBI) సవాల్ చేసింది. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానంలో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ పై అగస్టు 25న విచారణ చేపట్టనున్నట్టు సుప్రీం కోర్టు వెల్లడించింది.

గతంలో లాలూ సీఎంగా పని చేసిన సమయంలో దాణా కుంభ కోణానికి పాల్పడ్డారని ఆరోపణలు వున్నాయి. ఈ కేసులో ఆయనకు సీబీఐ కోర్టు ఐదేండ్ల శిక్ష విధించింది. దీంతో పాటు ఆయనకు రూ. 60 లక్షల జరిమానా విధించింది. ఆ తర్వాత దుమ్కా, దోరండా, చాయ్ బాసా, డియోఘర్ ట్రెజరీ కేసుల్లో ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ జార్ఖండ్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

తాజాగా ఆ ఉత్తర్వులను సుప్రీం కోర్టులో సీబీఐ సవాల్ చేసింది. 1990-97 మధ్య లాలూ సీఎంగా వున్నారు. ఆ సమయంలో దాణా కుంభకోణానికి పాల్పడ్డారని ఆయనపై ఆరోపణలు వున్నాయి. పశువుల దాణా, ఇతర అవసరాల కోసం ప్రభుత్వ ఖజానా నుంచి రూ. 950 కోట్లు అక్రమంగా ఆయన విత్ డ్రా చేశారని, వాటిని దుర్వినియోగం చేశారని అభియోగాలు వచ్చాయి.

ఈ కేసులో పలువురిని సీబీఐ అరెస్టు చేసింది. అందులో దోరండా కేసులో మొత్తం 99 మంది నిందితులు వుండగా అందులో 24 మందిని నిర్దోషులుగా న్యాయస్థానం విడుదల చేసింది. మరో 46 మందికి మూడేండ్ల జైలు శిక్ష విధించింది. ఈ నాలుగు కేసుల్లో లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) కు న్యాయస్థానం 14 ఏండ్ల శిక్ష విధించింది. ఆ తర్వాత హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన బయటకు వచ్చారు.

Also Read: మెజార్టీ ముస్లింలు హిందుత్వం నుంచి మారిన వారే… గులాం నబీ ఆజాద్ సెన్సేషనల్ కామెంట్స్…!

Advertisment
తాజా కథనాలు