భార్య బర్త్ డే డేట్ మరిచిపోతున్నారా.. ఐదేండ్లు జైలు శిక్ష తప్పదు

సమోవా దేశంలో అమలవుతున్న ఓ వింత చట్టం ప్రపంచవ్యాప్తంగా జనాలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఏ కారణంతోనైనా సరే లైఫ్ పార్ట్ నర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పని భర్తలంతా అక్కడ ఐదేళ్లు జైలు శిక్ష అనుభవించాల్సిందే. ప్రస్తుతం ఈ వార్త తెగ వైరల్ అవుతుంది.

New Update
భార్య బర్త్ డే డేట్ మరిచిపోతున్నారా.. ఐదేండ్లు జైలు శిక్ష తప్పదు

నిజానికి వరల్డ్ వైడ్ గా ఫ్యామిలీ బాధ్యతలు మోసేది అధికంగా పురుషులే. ముఖ్యంగా ఇండియాలో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. మారుతున్న కాలానుగుణంగా భర్తతో సమానంగా భార్య కూడా ఆర్థికపరమైన విషయంలో ఫ్యామిలీకి సపోర్ట్ గా నిలుస్తున్నారు. అయినప్పటికీ పూర్తి భరోసామాత్రం భర్తలమీదే ఉంటుందనేది నగ్న సత్యం. అయితే రీసెంట్ గా వెలుగులోకి వచ్చిన సమోవా దేశంలోని వింత రూల్ ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

Also read :ఈ జీవులకు ఆకలేస్తే తమ పిల్లలనే తింటాయట.. శాస్త్రవేత్తలు చెప్పిన ఆసక్తికర విషయాలివే

విషయానికొస్తే సమెవా అనే దేశంలో భార్య పుట్టినరోజు మరిచిపోతే భర్తకు ఐదేళ్ల జైలు శిక్ష పడుతుంది. మొదటిసారి మరిచిపోయినపుడు మాత్రం హెచ్చరించి వదిలేస్తారు. కానీ రెండోసారి కూడా మరిచిపోయినట్లైతే ఆ భర్తకు జరిమానా లేదా గరిష్ఠంగా ఐదేండ్ల జైలు శిక్ష విధిస్తారు. అంతేకాదు అక్కడ ఇలాంటి భర్తలను గుర్తించేందుకు ప్రత్యేకంగా పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ చట్టం గురించి మహిళలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దేశంలో ఏ మూలనైనా సరే బర్త్ డే డేట్ తెలిసినప్పటీకీ విష్ చేయని భర్తల సంగతి అంతే. ప్రస్తుతం ఈ విషయం తెలిసిన హస్బెండ్స్ ఒకింత ఆశ్యర్యానికి గురవుతూనే మరోవైపు షాక్ అవుతున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు