TG: ఆత్మహత్య చేసుకోను.. BRS లో చేరికపై ఎమ్మెల్యే సంచలన కామెంట్స్!

TG: తాను బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించారు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్‌. నిన్నటి నుండి తాను పార్టీ మారుతున్నానని వస్తున్నటువంటి వార్తలు అవాస్తవం అని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లడం అంటే ఆత్మహత్య చేసుకోవడమే అని అన్నారు.

New Update
Khammam Politics : బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్ లో చేరిన మరో ఎమ్మెల్యే!

MLA Tellam Venkat Rao: తాను బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించారు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్‌. నిన్నటి నుండి తాను పార్టీ మారుతున్నానని వస్తున్నటువంటి వార్తలు అవాస్తవం అని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లడం అంటే ప్రాణత్యాగం చేయడమే అని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే భద్రాచలం అభివృద్ధి చెందుతుందని భద్రాచలం అభివృద్ధి కొరకే బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లోకి రావటం జరిగిందని వివరణ ఇచ్చారు.

భద్రాచలం పట్టణ ప్రజలందరూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దని చెప్పారు. తన గురువు మంత్రి పొంగులేటి ఆశీస్సులతో.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆశీస్సులతో, అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దీవెనలతో భద్రాచలం అభివృద్ధి చెందుతుందని ఒకే ఒక్క నమ్మకంతో భద్రాచలం అభివృద్ధి కొరకే పార్టీ మారడం జరిగింది అదే నమ్మకంతో ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా తప్పితే పార్టీ మారడం జరగదని స్పష్టం చేశారు ఎమ్మెల్యే వెంకట్రావు.

Also Read: హైదరాబాద్‌లో మరోసారి రేవ్ పార్టీ కలకలం..వివాదంలో బిగ్‌బాస్ ఫేమ్ మెహబూబ్ షేక్‌..!

Advertisment
తాజా కథనాలు