Tirupati: తిరుపతిలో కిడ్నాప్ అయిన బాబు క్షేమం.. ఎక్కడ దొరికడంటే..!! తిరుపతిలో కిడ్నాప్‌కు గురైన చిన్నారి కథ సుఖాంతమైంది. బాలుడిని కిడ్నాప్ చేసిన సుధాకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాపర్ నుంచి తీసుకువచ్చిన బాలుడిని తల్లిదండ్రులకు పోలీసులు అప్పగించారు. బాలుడు కిడ్నాపైన 7 గంటల్లో పోలీసులు కేసును ఛేదించారు. By Vijaya Nimma 03 Oct 2023 in ఆంధ్రప్రదేశ్ తిరుపతి New Update షేర్ చేయండి తిరుపతి బస్టాండ్‌లో కిడ్నాప్ అయిన బాలుడు మురుగన్ సురక్షితంగా పోలీసుల చెంతకు చేరాడు. కిడ్నాపర్ నుంచి చిన్నారిని స్థానిక మహిళ కాపాడింది. రోడ్డుపై ఉన్న చిన్నారిని ఏర్పేడులో బాలుడిని క్షేమంగా పోలీసులకు అప్పగించింది నిందితుడి అక్క. చెన్నైకు చెందిన ఓ కుటుంబం శ్రీవారి దర్శనం కోసం వచ్చారు. తిరుగు ప్రయాణంలో తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌లోని అర్ధరాత్రి ఫ్లాట్ ఫారం-3 దగ్గర 2 గంటల సమయంలో సోమవారం రాత్రి బాలుడ్ని గుర్తు తెలియని వ్యక్తి అపహరించాడు. ఆందోళనతో తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. బాలుడ్ని వదిలేసి వెళ్లాడు కిడ్నాప్ అయిన బాలుడిని చెన్నై, వరసవక్కంకు చెందిన రామస్వామి చంద్రశేఖర్ కుమారుడు అరుల్ మురుగన్ అని తెలిసిందే. బాలుడితోపాటు కిడ్నాపర్ బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం సర్కిల్ దగ్గర కేన్సస్ హోటల్ వైపు వెళ్లినట్టు సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్ అయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. చివరకు కిడ్నాపర్ బాలుడ్ని వదిలేసి వెళ్లాడు. ఆ చిన్నారి ఓ మహిళ కంట పడడంతో.. ఆమె పోలీసులకు అప్పగించడం జరిగింది. భయపడిన పోలీసులకు అప్పగింత తిరుపతిలో చిన్నారిని అపహరించిన దొంగ తిరుపతి అవిలాలకి చెందిన సుధాకర్‌గా గుర్తించారు. భార్య వదిలేయడంతో సుధాకర్ ఒంటరిగా జీవిస్తున్నాడు. అక్కకు తాను పిల్లలు లేకపోవడంతో చిన్నారిని సుధాకర్ అపహరించినట్లు తెలుస్తోంది. ఏర్పేడు మండలం మధవమాలలోని తన అక్క ఇంట్లో చిన్నారిని సుధాకర్ విడిచినట్లు సమాచారం. చిన్నారిని తన అక్కకు నిందితుడు అప్పగించిట్లుగా తెలుస్తోంది. అయితే.. పోలీసుల గాలింపు చర్యలకు భయపడిన సుధాకర్ అక్క.. నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి చిన్నారిని అప్పగించింది. తిరుమలలో కిడ్నాప్ అయిన చిన్నారిని తల్లిదండ్రుల ఒడికి చేరాడు. క్షేమంగా చిన్నారిని పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. తమ బిడ్డ క్షేమంగా తిరిగిరావడంతో తల్లిదండ్రుల సంతోషించారు. బాబు కిడ్నాప్‌తో తీవ్ర ఆందోళన చెందిన తల్లిదండ్రులు.. వెంకన్న దయవల్లే బిడ్డ తిరిగి చేరాడని వారు ఆనందించారు. #police #tirupati #sudhakar #babu-kidnapped #safe మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి