Gifts For Guests : ఈ నెల 22న జరగనున్న అయోధ్య(Ayodhya) రామమందిర(Ram Mandir) ప్రారంభోత్సవానికి ప్రపంచం అంతా ఆతృతగా ఎదురు చూస్తోంది. ఈ వేడుకల సంరంభం అప్పుడే మొదలైంది కూడా. పదిరోజులు వరుస కార్యక్రమాలు చేస్తామని గుడి నిర్వాహకులు చెబుతున్నారు. దీని కోసం ప్రధాని మోదీ(PM Modi) ప్రత్యేక దీక్ష కూడా చేస్తున్నారు. శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట కోసం అందరూ వెయ్యి కన్నులతో ఎదురు చూస్తున్నారు. రాముడి కోసం కానుకలు ఎన్నో అయోధ్యకు చేరుతున్నాయి. ఇక రామ విగ్రహ ప్రతిష్ట కోసం 11 వేలమంది విశిష్ట అతిధులకు ఆహ్వానాలు వెళ్ళాయి. మన తెలుగు హీరోలకు కూడా చాలా మందికి ఆహ్వానాలు వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) తాను సతీసమేతంగా అయోధ్యకు వెళతానని ప్రకటించారు కూడా.
Also Read:చంద్రబాబు-పవన్ కల్యాణ్ భేటీ..సీట్ల సర్దుబాటుపై చర్చ
ఇక రామమందిర ప్రారంభోత్సవానికి విచ్చేసే అతిధుల కోసం అపూర్వ కానుకలను తయారు చేసింది గుడి నిర్వాహక కమిటీ. ఇప్పటికే అతిథులకు ప్రత్యేకంగా తయఆరు చేసిన మోతీచూర్ లడ్డూను ప్రసాదంగా ఇస్తాయని ట్రస్ట్ ప్రకటించింది. ఇప్పుడు దాంతో పాటూ రామ్‌రాజ్ అనే బాక్సులను కూడా కానుకగా అందిస్తామని చెబుతోంది. అయోధ్య రామమందిరం నిర్మాణం ప్రారంభించే ముందు మందిర పునాదిలోని పవిత్రమైన మట్టిని సేకరించారు. ఆ మట్టిని ప్రత్యేకమైన బాక్సుల్లో ప్యాక్ చేసి దానినే విశిష్ట అతిధులకు కానుకగా అందించనున్నారు. ఒకవేళ ఎవరైనా వేడుకకు రాకపోతే వారు తర్వాత తొలిసారిగా గుడికి వచ్చినప్పుడు రామ్‌రాజ్ కానుకను అందజేస్తామని చెబుతున్నారు. ఇక ప్రధాని మోడీకి మాత్రం 15 మీటర్ల పొడవున్న రాముని గుడి చిత్ర పటాన్ని జ్యూట్ బ్యాగ్‌లో ఉంచి కానుకగా ఇవ్వనున్నారు.
మరోవైపు రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఎంతోమంది వ్యాపారకులు, చిరువ్యాపారలకు(Small Investors) లాభం చేకూరుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెలలో భారతదేశం అంతంటా రూ.50 వేల కోట్ల వ్యాపారం జరిగి దేశానికి సహాయపడే అవకాశం ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(CAIT) అంచనా వేస్తోంది. కండువాలు, కీ చైన్లు, రామాలయం నమునాలు, రామ్ దర్బార్, రామధ్వజ చిత్రాలు ఇలా ఇతర వస్తువులన్నింటికీ దేశవ్యాప్తంగా ప్రస్తుతం మంచి డిమాండ్ ఉందని సీఏఐటీ చెబుతోంది. అంతేకాదు అటు కస్టమర్ల డిమాండ్‌కు తగ్గట్లుగా కూడా మార్కెట్లో గాజులు, పెండెంట్‌లు వంటి వివిధ రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. అలాగే రామమందిర చిత్రం ఉన్నటువంటి టీ షర్టులు, కుర్తాలు, ఇతర దూస్తులకు కూడా గణనీయంగా డిమాండ్ ఉన్నట్లు సీఏఐటి పేర్కొంది.