Sunil Gavaskar: విమర్శలు మానుకోండి

ఆసియా కప్‌లో భారత జట్టు పాల్గొనే టీమ్‌పై వస్తున్నవిమర్శలుపై మాజీ క్రికెటర్లు స్పందించారు. సెలక్టర్లపై విమర్శలు ఆపాలన్నారు. ఆసియా కప్‌లో భారత క్రికెటర్లు రాణించాలని కోరుకోవాలన్నారు. మరోవైపు టీమ్‌లో 4వ స్థానంపై గంగూలీ క్లారీటి ఇచ్చాడు.

Sunil Gavaskar: విమర్శలు మానుకోండి
New Update

ఆసియా కప్‌లో భారత జట్టు పాల్గొనే టీమ్‌పై పలువురు విమర్శలు చేస్తున్నారు. బీసీసీఐ విడుదల చేసిన లిస్ట్‌లో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్‌, చాహల్‌ లేకపోవడంపై స్పందించిన మాజీలు.. సెలక్టర్లు ఏ వ్యూహంతో టీమ్‌ను ఎంపిక చేశారో తమకు అర్ధంకావడం లేదన్నారు. దీంతో విమర్శలపై స్పందించిన సునీల్‌ గవాస్కర్.. బీసీసీఐకి మద్దతుగా నిలిచారు. విమర్శలపై మండిపడ్డ ఆయన.. మాజీ ఆటగాళ్లు, అభిమానులు విమర్శలు చేయడం మానుకొని జట్టుకు మద్దతుగా నిలవాలని సూచించారు. ముఖ్యంగా ప్రతీ ఒక్కరు సోషల్‌ మీడియా వేదికగా అశ్విన్‌ గురించి మాట్లాడుతున్నారన్న ఆయన.. అభిమానులు అశ్విన్‌ గురించి మాట్లాడి వివాదాలను సృష్టించవద్దని కోరారు.

మరోవైపు భారత జట్టులో 4వ స్థానంపై వస్తున్న వార్తలపై బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరబ్‌ గంగూలీ స్పందించారు. టీమ్‌లో 4వ స్థానానికి చాలా ప్రత్యామ్నాయాలు ఉన్నాయని ఆయన తెలిపారు. బ్యాటింగ్‌ లైనఫ్‌లో ఒక్క స్థానంతో వచ్చే ఇబ్బంది ఏమీ లేదన్నారు. ఇండియాలో అపారమైన ప్రతిభ ఉన్న ఆటగాళ్లు అనేక మంది ఉన్నారన్నారు. టీమ్‌లో 4వ స్థానం సమస్యగా మారిందనడం తప్పన్నారు. మన క్రికెటర్లలో ప్రతిభ లేదనే వార్తలు ఎక్కువగా వస్తున్నాయన్న గంగూలీ.. ప్రతిభ ఉన్న ఆటగాళ్లను పరిగణలోకి తీసుకోకపోతుండటమే టీమిండియాకు పెద్ద సమస్యగా మారిందన్నారు. ఆ స్థానంపై కెప్టెన్‌ రోహిత్ శర్మ, కోచ్‌ రాహుల్‌ ద్రావిడ్‌ ఓ నిర్ణయానికి రావాలని సూచించారు.

ఆసియా కప్‌లో కేఎల్‌ రాహుల్‌ను ఏ స్థానంలో బ్యాటింగ్‌కు దించాలని మేనేజ్‌మెంట్‌ చూస్తోందని గంగూలీ ప్రశ్నించారు. కీపర్‌గా టీమ్‌లోకి వచ్చిన కేఎల్‌ రాహుల్‌ ఓపెనర్‌గా రాణిస్తున్నాడని, అలాంటి ఆటగాడిని 6వ స్థానంలో బ్యాటింగ్‌కు పంపుతే విఫలమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. మరోవైపు గిల్‌ ఓపెనర్‌గా రాణిస్తాడని తనకు నమ్మకం లేదన్నారు.

#asia-cup #team-india #bcci #sourav-ganguly #sunil-gavaskar
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe