Paralympics: శభాష్ అమ్మాయిలు.. పారాలింపిక్స్‌లో ఒకరికి పసిడి, మరొకరికి కాంస్యం

పారిస్‌లో జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత అమ్మాయిలు అదరగొట్టారు. పారా షూటర్‌ అవనీ లేఖరా.. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌ ఎస్‌హెచ్‌ 1లో స్వర్ణం సాధించింది. అలాగే ఇదే ఈవెంట్‌లో మోనా అగర్వాల్ అనే మరో అమ్మాయి కూడా కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది.

New Update
Paralympics: శభాష్ అమ్మాయిలు.. పారాలింపిక్స్‌లో ఒకరికి పసిడి, మరొకరికి కాంస్యం

పారిస్‌లో జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత అమ్మాయిలు అదరగొట్టారు. ఎయిర్‌ రైఫిల్‌ పోటీలో ఒకరు బంగారు పతకం, మరొకరు సర్ణం సాధించారు. రాజస్థాన్‌కు చెందిన పారా షూటర్‌ అవనీ లేఖరా.. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌ ఎస్‌హెచ్‌ 1లో స్వర్ణం సాధించింది. అలాగే ఇదే ఈవెంట్‌లో మోనా అగర్వాల్ అనే మరో అమ్మాయి కూడా తలపడి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. మరో విషయం ఏంటంటే టోక్యో పారాలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌లో అవనీ లేఖరా పసిడి గెలిచింది. అలాగే 50 మీటర్ల రైఫిల్ త్రీ పోజిషన్స్‌లో కూడా కాంస్యం సాధించింది. పారిస్‌ పారాలింపిక్స్‌లో కూడా ఆమె అదే జోరును కొనసాగించి.. భారత్‌కు బంగారు పతకాన్ని సాధించింది. పారాలింపిక్స్‌లో రెండుసార్లు బంగారు పతకం సాధించిన మొదటి భారతీయ అమ్మాయిగా అవనీ రికార్డు సృష్టించింది. ఇక ఇటీవల జరిగిన ఒలింపిక్స్‌ పోటీల్లో భారత్‌కు ఒక్క బంగారు పతకం దక్కలేదన్న సంగతి తెలిసిందే.

Also Read: భారత్‌ వల్లే బంగ్లాలో వరదలు.. వంకరబుద్ధి పోనిచ్చుకోలేదంటూ విమర్శలు!

Advertisment
తాజా కథనాలు