Hydra : రంగనాథ్‌కు మరో కీలక పదవి! హైడ్రా చీఫ్ ఏవీ రంగనాథ్‌కు సీఎం రేవంత్ మరో కీలక పదవి అప్పగించనున్నట్లు తెలుస్తోంది. హెచ్‌ఎండీఏ పరిధిలోని చెరువుల పరిరక్షణకోసం ఏర్పాటుచేసిన 'లేక్స్ ప్రొటెక్షన్ కమిటీ' ఛైర్మన్‌గా నియమించనున్నట్లు సమాచారం. 7జిల్లాల్లో చెరువులను పరిరక్షించేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. By srinivas 03 Sep 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Ranganath : హైడ్రా (Hydra) చీఫ్ ఏవీ రంగనాథ్‌కు రేవంత్ సర్కార్ (Revanth Government) మరో కీలక బాధ్యత అప్పగించబోతున్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ (Greater Hyderabad) కేంద్రంగా భూ కబ్జాదారుల గుండెల్లో గుబులు రేపుతున్న రంగనాథ్‌కు ప్రజలు, ప్రముఖుల నుంచి భారీ మద్దతు పెరగడంతో మరిన్ని బాధ్యతలు అప్పగించేందుకు సీఎం రేవంత్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు హెచ్‌ఎండీఏ (HMDA) పరిధిలోని చెరువుల పరిరక్షణకోసం ఏర్పాటుచేసిన 'లేక్స్ ప్రొటెక్షన్ కమిటీ' ఛైర్మన్‌గా రంగనాథ్ ను నియమించనున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తు తరాల కోసం చెరువులను పరిరక్షించాలని చెబుతున్న రేవంత్ రెడ్డి.. తను చేపట్టిన పనిని రంగానాథ్ ఆధ్వర్యంలో మరింత విజయవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రభుత్వ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. 7జిల్లాల్లో చెరువుల పరిరక్షణ.. ఈ మేరకు హెచ్‌ఎండీఏలోని 7జిల్లాల్లో చెరువుల పరిరక్షణను హైడ్రా కింద చేరిస్తే ఆక్రమణల నుంచి కాపాడవచ్చని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే హైడ్రాతోపాటు చెరువుల పరిరక్షణ కమిటీ బాధ్యతలను రంగనాథ్ కే ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ అంశానికి సంబంధించిన అధికారిక ప్రకనట త్వరలోనే వెల్లడించబోతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నవంబరు 1వరకు నోటిఫికేషన్లు జారీ.. ఇదిలా ఉంటే.. సోమవారం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్, యాదాద్రి-భువనగిరి, సిద్దిపేట కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ పరిధిలో ఉన్న 7 జిల్లాల్లో చెరువుల సర్వే, ఎఫ్‌టీఎల్, నోటిఫికేషన్ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. నవంబరు 1వరకు హెచ్‌ఎండీఏ పరిధిలోని అన్ని చెరువుల సర్వేతో పాటు ఎఫ్‌టీఎల్‌కు సంబంధించి నోటిఫికేషన్లు జారీ చేయాలని ఆదేశించారు. ఇది కూడా చదవండి: Khammam Floods-Revanth Reddy: ఖమ్మంలో వరదలకు కారణం వారే.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు! ఇక హెచ్‌ఎండీఏ పరిధిలో 3,500 చెరువులుండగా 265 చెరువులను నోటిఫై చేశారు. ఆగస్టు నుంచి ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేయనుండగా మొదటి నోటిఫికేషన్ కోసం 50 చెరువులు తమ పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు. హైదరాబాద్ చుట్టూ అవుటర్ రింగ్‌రోడ్డు వరకు ఉన్న చెరువులు, కుంటలు, జలవనరుల ఎఫ్‌టీఎల్‌లు, బఫర్‌జోన్లలో అక్రమంగా నిర్మించిన ఇండ్లు, ఆఫీసులు, పలు నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. #revanth-reddy #hydra #av-ranganath #lakes-protection-committee మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి