గత కొన్నిరోజుల నుంచి మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అక్రమ నిర్మాణాలే లక్ష్యంగా.. రాష్ట్ర సర్కార్ వాటిని కూల్చివేయడం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈరోజు మరోసారి మల్లారెడ్డికి చెందిన అక్రమ నిర్మాణాలపై అధికారులు చర్యలు తీసుకున్నారు. మేడ్చల్‌లోని ఆయన కుమారుడు మహేందర్‌రెడ్డికి సంబంధించిన నిర్మాణాలను కూల్చివేశారు. జాతీయ రహదారిపై మేడ్చల్ డిపోకు ఎదురుగా ఉన్నటువంటి పాన్ డబ్బాలు, రేకుల షెడ్లను అనుమతులు లేకుండా నిర్మించారని.. అందుకే వీటిని కూల్చివేశామని వెల్లడించారు.
Also Read: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. కొలువుల భర్తీ అప్పుడే
మల్లారెడ్డి అక్రమ కట్టడాలపై రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టిన నేపథ్యంలో.. ఇటీవల మల్లారెడ్డి, ఆయన అల్లుడికి సంబంధించిన విద్యాసంస్థల్లో కూడా కూల్చివేతలు జరిగాయి. అయితే ఇలా వరుసగా అక్రమ కూల్చివేతలు జరగడంతో మల్లారెడ్డిలో ఆందోళన మొదలైంది.