నేడు(జనవరి 24) జాతీయ బాలిక దినోత్సవం. జనవరి 24, 1966న ఇందిరా గాంధీ భారతదేశపు మొదటి మహిళా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అందుకే, భారతీయ చరిత్ర, మహిళా సాధికారత, లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడానికి జనవరి 24ని జాతీయ బాలికా దినోత్సవంగా ఎంచుకున్నారు.

Trinath
వన్‌ప్లస్-12 ఇవాళ రాత్రి 7:30 నిమిషాలకు లాంచ్ కానుంది. శక్తివంతమైన ప్రాసెసర్, గ్రేట్ కెమెరా సెటప్, శక్తివంతమైన బ్యాటరీతో ఈ మొబైల్ రానుంది. వన్ ప్లస్-12 బేస్ వేరియంట్ ధర రూ. 64,999 ఉండొచ్చని అంచనా. వన్‌ప్లస్-12 విక్రయం జనవరి 30 నుంచి ప్రారంభమవుతుంది.
టీడీపీతో కలిసి పనిచేయడం లేదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల్లో పనిచేయమని చంద్రబాబు అడిగారని అయితే అది కుదరదని చెప్పినట్టు తెలిపారు. తన ఇద్దరి కామన్ ఫ్రెండ్ ఫోర్స్ చేయడం వల్లే విజయవాడ వెళ్లానని బాంబు పేల్చారు.
అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా హర్యానాలోని భివానీలో న్యూ బసుకినాథ్ రామ్‌లీలా కమిటీ డ్రామా నిర్వహించింది. ఈ నాటకంలో హనుమంతుడి పాత్రలో ఉన్న హరీష్‌కుమార్ గుండెపోటుతో మరణించారు. హరీష్ 25 ఏళ్లుగా కమిటీలో హనుమంతుడి పాత్ర పోషిస్తున్నారు.
బాలరాముడిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో రావడంతో ఆలయం వద్ద గందరగోళం నెలకొంది.ఇది స్వల్ప తోపులాటకు దారితీసింది. భక్తులు గుడిలోకి పెద్ద సంఖ్యలోకి రావడంతో రామాలయం వెలుపల భారీ రద్దీ నెలకొంది.
'వైఎస్‌ఆర్ ఆసరా' పథకం(YSR Aasara Scheme) కింద 78,94,169 మంది మహిళలకు లబ్ధి చేకూర్చేందుకు నాల్గవ విడతగా రూ.6,394.83 కోట్ల ఆర్థిక సహాయాన్ని ఏపీ ప్రభుత్వం అందించనుంది. ఇవాళ(జనవరి 23) అనంతపురం జిల్లా ఉరవకొండ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించనున్నారు.
ఏపీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కొత్త అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజకీయ యాత్రకు సిద్ధమయ్యారు. 2003లో తన తండ్రి, దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి పాదయాత్రను ముగించిన ఇచ్ఛాపురం నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టడంతో శ్రీకాకుళం జిల్లా మరో రాజకీయ యాత్రకు సిద్ధమైంది.
మహిళల చర్మ సంరక్షణ(Women Skin Care) కోసం కొన్ని సూపర్ ఫుడ్స్ ఉన్నాయి. అందులో బాదం, వాల్నట్, బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలు ప్రధానమైనవిగా చెప్పవచ్చు. రోజుకు తగినంత వాటర్ తాగడంతో పాటు వీలు కుదిరినప్పుడు స్వీట్ పొటాటోస్, టమోటాలు, అవకాడో, చేపలు తింటే చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ఏపీ ప్రభుత్వంతో అంగన్‌వాడీ సంఘాలు జరిపిన చర్చలు కొలిక్కి వచ్చాయి. అంగన్‌వాడీల డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. జూలైలో జీతాలు పెంచుతామని హామీ ఇవ్వడంతో అంగన్‌వాడీలు తిరిగి తమ విధుల్లో చేరనున్నారు.
పుట్టుకతో వచ్చే లోపాలను నివారించడానికి గర్భధారణ సమయంలో మంచి జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. అప్పుడే ఆరోగ్యకరమైన ప్రసవం సాధ్యమవుతుంది. ఇక పిల్లల్లో పుట్టుకతో వచ్చే లోపాల గురించి, వాటి నివారణ గురించి నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకోవాలనుకుంటే ఆర్టికల్ మొత్తం చదవండి.
Advertisment
తాజా కథనాలు