Video: శ్రీరాముడి పాదాల వద్ద కుప్పకూలిన హనుమంతుడు.. నాటకం మధ్యలో గుండెపోటు!

అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా హర్యానాలోని భివానీలో న్యూ బసుకినాథ్ రామ్‌లీలా కమిటీ డ్రామా నిర్వహించింది. ఈ నాటకంలో హనుమంతుడి పాత్రలో ఉన్న హరీష్‌కుమార్‌ గుండెపోటుతో మరణించారు. హరీష్ 25 ఏళ్లుగా కమిటీలో హనుమంతుడి పాత్ర పోషిస్తున్నారు.

New Update
Video: శ్రీరాముడి పాదాల వద్ద కుప్పకూలిన హనుమంతుడు.. నాటకం మధ్యలో గుండెపోటు!

A man who was playing the role of Hanuman in a 'Ramlila' play died on stage: అయోధ్య(Ayodhya)లో శ్రీరామ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా హర్యానా(Haryana) భివానీలోని జవహర్ చౌక్‌లో రాంలీలా వేదికగా కొందరు నాటకం ప్రదర్శించారు. హనుమంతుని పాత్ర పోషిస్తున్న ఎంసీ కాలనీకి చెందిన హరీష్ శ్రీరాముడి ఒడిలో కన్నుమూశాడు. భగవంతుని పాదాల చెంత పడేంత వరకు ప్రజలు ఈ సీన్‌ను డ్రామాలో భాగంగా భావించారు. అందరికీ అసలు విషయం అర్థమయ్యేసరికి అతను చనిపోయాడు.


అందరూ చూస్తుండగానే:
నిన్న(జనవరి 22) అయోధ్యలో శ్రీరామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ వేడుకలో అందరూ ఉత్సాహంగా ఉండగా, అదే సమయంలో హనుమంతుడి పాత్ర పోషిస్తున్న 62 ఏళ్ల ఎంసీ కాలనీ వాసి హరీష్‌కుమార్ మరణించడం బాధకారం. వేదికపై శ్రీరాముడి ఒడిలో హరీష్ జీవితం ముగిసిపోయింది. హరీష్ 25 ఏళ్లుగా న్యూ బసుకినాథ్ రాంలీలా కమిటీ భివానీలో హనుమంతుడి పాత్రలో నటిస్తున్నాడు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌లో జేఈగా పనిచేసి పదవీ విరమణ చేసిన తర్వాత కూడా రాంలీలా ప్రదర్శనతో నిరంతరం అనుబంధం కలిగి ఉన్నాడు. రామ్‌లీలాలో లక్ష్మణ్‌గా నటించిన సురేశ్ సైనీ మాట్లాడుతూ.. హరీష్‌కి చిన్నప్పటి నుంచి రామ్‌లీలాలో నటించడం అంటే ఇష్టమని చెప్పారు. ఈ అభిరుచి కారణంగా, అతను రాంలీలా కమిటీతో సంబంధం కలిగి ఉన్నాడన్నాడు. నటించేటప్పుడు శ్రీరాముడిలో నిమగ్నమైపోతాడని చెప్పారు. అయోధ్యలో రాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా రాంలీలా కమిటీ కళాకారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంతో హరీష్‌ ఎంతో ఉత్సాహంగా కనిపించాడు. అయితే ఇంతలోనే గుండెపోటు రావడం.. స్టేజీపైనే మరణించడంతో సభా ప్రాంగణంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

నటిస్తున్నాడని భావించారు:
స్టేజ్ మీద నటించడం మొదలుపెట్టాక పూర్తిగా భగవంతుని భక్తిలో మునిగిపోయాడు హరీష్‌. రాముని పాదాలకు నమస్కరించినప్పుడు, అతను ఉద్వేగానికి లోనయ్యాడని అందరూ అనుకున్నారు. అందుకే అతను చాలా సేపు పైకి లేవలేదని భావించారు. తోటి కళాకారులు అతన్ని లేపేందుకు ప్రయత్నించగా హరీష్‌ అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్నాడు. వెంటనే సహచరులు అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే హరీష్‌ ఈ ప్రపంచానికి వీడ్కోలు పలికినట్లుగా డాక్టర్లు చెప్పడంతో అంతా ఒక్కసారిగా కన్నీరుమున్నిరయ్యారు.

Also Read: ఇక కాస్కోండి తమ్ముళ్లు… షర్మిల రాజకీయ పోరాట యాత్ర వైపే అందరిచూపు..!

WATCH:

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు