AP Anganwadi News : అంగన్వాడీలతో ప్రభుత్వ చర్చలు సఫలం.. జీతాల పెంపు ఎప్పుడంటే? ఏపీ ప్రభుత్వంతో అంగన్వాడీ సంఘాలు జరిపిన చర్చలు కొలిక్కి వచ్చాయి. అంగన్వాడీల డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. జులైలో జీతాలు పెంచుతామని హామీ ఇవ్వడంతో అంగన్వాడీలు తిరిగి తమ విధుల్లో చేరనున్నారు. By Trinath 23 Jan 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి Anganwadi Workers Vs AP Government : అంగన్వాడీ(Anganwadi) లతో ప్రభుత్వ చర్చలు సఫలమయ్యాయి. దీంతో అంగన్వాడీలు విధుల్లోకి చేరనున్నారు. అంగన్వాడీల 11 డిమాండ్లలో 10 ఇప్పటికే పరిష్కారించామన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana). జులైలో జీతాలు పెంచుతామని స్పష్టం చేశారు. ఉద్యోగ విరమణ సమయంలో ఇచ్చే ప్రయోజనాన్ని 50 వేల నుంచి లక్షా 20 వేల రూపాయలకు పెంచామన్నారు. ఇక హెల్పర్ కు 60 వేలకు పెంచాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. మట్టి ఖర్చులు 20 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని.. సమ్మె కాలానికి జీతాలు ఇస్తామని తెలిపారు. సమ్మె సమయంలో పెట్టిన కేసులు ఎత్తేస్తామని చెప్పారు. వేతనాల పెంపు పై చర్చల్లో తీసుకున్న నిర్ణయాన్ని మినిట్స్ లో నమోదు చేస్తామన్నారు. గ్రాట్యువిటీకి సంబంధించి కేంద్రం నిబంధనలను పాటిస్తామని క్లారిటీ ఇచ్చారు. ఉద్యోగ విరమణ(Employee Retirement) వయస్సు 60 నుంచి 62 ఏళ్ళ కు పెంచామన్నారు. అంగన్వాడీ రోజువారీ కార్యక్రమాల్లో సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నామని చెప్పుకొచ్చారు మంత్రి. తమ ప్రభుత్వం ఉద్యోగుల పక్షపాతి అని.. కక్షసాధింపు చర్యలకు పాల్పడే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదన్నారు. మినీ సెంటర్లను అప్ గ్రేడ్ చేస్తామని చెప్పారు బొత్స. సుబ్బరావమ్మ, ఏపీ అంగన్వాడీ ప్రధాన కార్యదర్శి ఏం అన్నారంటే? -- > చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయి. -- > సమ్మె విరమిస్తున్నాం... విధులకు హాజరవుతాం -- > జీతాలు పెంపు పై నిర్ధిష్ట నిర్ణయంగా జులైలో చేస్తామన్నారు. -- > మాకు జీతాల పెంపు ఎంత అనేది కూడా రాతపూర్వకంగా ఇస్తామన్నారు. -- > రిటైర్మెంట్ బెనిఫిట్ ను పెంచుతాం అని హామీ ఇచ్చారు. -- > మా డిమాండ్లు నెరవేర్చడానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. -- > వైఎస్ఆర్ భీమా(YSR Bima) ఇస్తాం అన్నారు. -- > రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచుతాం అని ప్రభుత్వం చెప్పింది. -- > టిఏ బిల్లుల అంశంలో కేంద్రం నుంచీ వచ్చే లోపు రాష్ట్రం ఇవ్వడానికి ఒప్పుకుంది. -- > సీఎఫ్ఎంఎస్(CFMS) తీసేసి సంక్షేమ పధకాలు అంగన్వాడీలకు వర్తింపుచేస్తాం అన్నారు. -- > సమ్మె కాలానికి జీతం ఇవ్వడంతో పాటు... కేసులు ఎత్తేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. Also Read: పిల్లల్లో పుట్టుకతో వచ్చే లోపాలు.. నిపుణుల నుంచి అసలు నిజాలు తెలుసుకోండి! WATCH: #andhra-pradesh #botsa-satyanaryana #anganwadi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి