Ayodhya : భారీ సంఖ్యలో పోటెత్తిన భక్తులు.. రామమందిరం వద్ద తోపులాట.. గందరగోళం! బాలరాముడిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో రావడంతో ఆలయం వద్ద గందరగోళం నెలకొంది.ఇది స్వల్ప తోపులాటకు దారితీసింది. భక్తులు గుడిలోకి పెద్ద సంఖ్యలోకి రావడంతో రామాలయం వెలుపల భారీ రద్దీ నెలకొంది. By Trinath 23 Jan 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Stampede Like Situation at Ayodhya Ram Mandir : అయోధ్య(Ayodhya) లో 'ప్రాణ ప్రతిష్ఠ'(Prana Pratishtha) వేడుక ముగిసిన ఒక రోజు తర్వాత(అంటే ఇవాళ-జనవరి 23) రామ మందిరాన్ని(Ram Mandir) సామాన్య ప్రజల కోసం తెరిచారు. రామ్ లల్లా(Ram Lalla) మొదటి దర్శనం పొందడానికి భక్తులు మంగళవారం ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో గుమిగూడారు. ప్రాణ్ ప్రతిష్ఠా కార్యక్రమం ముగిసిన తర్వాత మొదటి రోజు ఉదయం పూజలు చేయడానికి భక్తులు బారులు తీరారు. రామ్‌లల్లా దర్శనం చేసుకోవడానికి భక్తులు తెల్లవారుజామున 3 గంటల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించే ముందు భక్తులు తప్పనిసరిగా పాస్‌లు బుక్ చేసుకోవాలి. ఆలయం భక్తుల కోసం ఉదయం 7:00 నుంచి 11:30 వరకు.. ఆ తరువాత మధ్యాహ్నం 2:00గంటల నుంచి రాత్రి 7:00గంటల వరకు తెరిచి ఉంటుంది. #WATCH | Ayodhya, Uttar Pradesh: Heavy rush outside the Ram Temple as devotees throng the temple to offer prayers and have Darshan of Shri Ram Lalla on the first morning after the Pran Pratishtha ceremony pic.twitter.com/gQHInJ5FTz — ANI (@ANI) January 23, 2024 తోపులాట.. గందరగోళం: బాలరాముడిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో రావడంతో ఆలయం వద్ద గందరగోళం నెలకొంది. స్వల్ప తోపులాటకు దారితీసింది. భక్తులు గుడిలోకి పెద్ద సంఖ్యలోకి రావడంతో రామాలయం వెలుపల భారీ రద్దీ నెలకొంది. షెడ్యూల్: రెండు ప్రత్యేక ఆరతి వేడుకలు ఉండనున్నాయి. జాగరణ్/శృంగార్ ఆరతి ఉదయం 6:30 గంటలకు, సంధ్యా ఆరతి రాత్రి 7:30 గంటలకు షెడ్యూల్ చేశారు. జాగరణ్ / శృంగార్ ఆరతి కోసం భక్తులు ముందుగానే బుక్ చేసుకునే అవకాశం ఉంది. వేడుకకు ఒక రోజు ముందు బుకింగ్ అందుబాటులో ఉంటుంది. ఆఫ్‌లైన్ పాస్‌ల కోసం.. ఆరతికి హాజరు కావాలనుకునే భక్తులు రామజన్మభూమి(Ram Janmabhoomi) తీర్థ క్షేత్ర ట్రస్ట్ వెబ్సైట్లో పేర్కొన్న విధంగా చెల్లుబాటయ్యే ప్రభుత్వ ID ప్రూఫ్‌ను సమర్పించాలి. నిర్ణీత ఆరతి సమయానికి 30 నిమిషాల ముందు తప్పనిసరిగా అయోధ్యలోని క్యాంపు కార్యాలయాన్ని సందర్శించాలి. ప్రత్యామ్నాయంగా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం, మొబైల్ నంబర్‌తో లాగిన్ చేయడం, మొబైల్‌కు పంపిన OTP ద్వారా గుర్తింపును ధృవీకరించడం ద్వారా ఆన్లైన్ పాస్(Online Pass) లను సేఫ్ చేయవచ్చు. 'మై ప్రొఫైల్'(My Profile) విభాగంలో, భక్తులు ఆరతి లేదా దర్శనం కోసం తమకు ఇష్టమైన స్లాట్‌ను ఎంచుకోవచ్చు. Also Read: ఇక కాస్కోండి తమ్ముళ్లు… షర్మిల రాజకీయ పోరాట యాత్ర వైపే అందరిచూపు..! WATCH: #ayodhya #ram-lalla #ram-mandir #stampede మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి