వనపర్తి జిల్లాలో దారుణం జరిగింది. మదనాపురం మండలంలోని గోవిందహళ్లికి చెందిన గొల్లి తిరుపతయ్య ఎగ్ బజ్జీ తింటుండగా గొంతులో ఇరుక్కుపోయింది. కిందపడిపోయిన తిరుపతయ్య గొంతులో నుంచి చుట్టుపక్కలవారు వచ్చి బజ్జీ తీశారు. అప్పటికే ఆలస్యం కావడంతో తిరుపతయ్య ఊపిరాడక ప్రాణం విడిచాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది.

Bhoomi
ఆస్తి పన్ను బకాయిలపై ఏపీ సర్కార్ వడ్డీ మాఫీ చేయనున్నట్లు ప్రకటించింది. వన్ టైం సెటిల్ మెంట్ విధానం ద్వారా వడ్డీ మాఫీ చేయనున్నట్లు సమాచారం. ఆస్తిపన్నుపై వడ్డీ మాఫీ చేస్తూ స్పెషల్ సీఎస్ శ్రీలక్ష్మీ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సంవత్సరం మార్చి 31వరకు వర్తించనుంది.
తెలంగాణలో నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పిన సంగతి తెలిసిందే. 11,062 ఉపాధ్యాయ పోస్టుల కోసం డీఎస్సీ నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. రిక్రూట్‌మెంట్ పరీక్షలు మే/జూన్‌లో నిర్వహించే అవకాశం ఉంది. జిల్లాల వారీగా ఉద్యోగ ఖాళీలను తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి.
ఐక్యరాజ్యసమితిలో భారత్ సత్తా ఏంటో మరోసారి చూపించింది. పాకిస్తాన్ తోపాటు టర్కీని ఏకిపారేసింది. పాక్ దుస్థితి గురించి గట్టిగా మాట్లాడింది. మీ చేతులు రక్తంతో తడిసిపోయాయి...మీరా మాకు చెప్పేది అంటూ ఆ లేడీ సింగం గర్జించింది. పాక్ కు గట్టిగా బుద్ధి చెప్పింది. ఆమె ఎవరో కాదు..భారత కార్యదర్శి అనుపమ సింగ్. పాక్ తీరును ఎండగట్టిన ఆమె గురించి నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు.
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మార్చి 1 నుంచి 3వ తేదీ వరకు జరగనున్నాయి. అతిథులకు 2,500రకాల వంటకాలను వడ్డించనున్నారు. అతిధులకు థాయ్, జపనీస్, మెక్సికన్, పార్సీ, పాన్ ఆసియన్, గ్లోబల్ మెనూను సిద్ధం చేస్తున్నారు. 75 రకాల బ్రేక్‌ఫాస్ట్, 225 రకాలతో మధ్యాహ్న భోజనం, 275 వంటకాలతో రాత్రి భోజనం, 85 ఐటెమ్స్‌తో మిడ్‌నైట్ మీల్స్ అందుబాటులో ఉంటాయి.
తెలంగాణలోని సంక్షేమ గురుకులాల్లో జూనియర్ లెక్చరర్ రాతపరీక్షల ఫలితాలు రిలీయ్ అయ్యాయి. ఈ ఫలితాలను గురకుల నియామక బోర్డు ఇవాళ విడుదల చేసింది. జేఎల్ పోస్టులకు ఎంపికైన వారి జాబితాను సబ్జెక్టుల వారీగా వెబ్ సైట్లో అందుబాటులో ఉంచారు.
త్వరలోనే ముఖేష్ అంబానీ కుటుంబంలో మరో వ్యక్తి చేరబోతున్నారు. నీతా అంబానీ చిన్నకొడుకు అనంత్ అంబానీ, రాధికమర్చంట్ ను వివాహం చేసుకోబోతున్నారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో అనంత్, రాధిక మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ జరుగుతోంది.అయితే ఈ కథనంలో అంబానీ కాబోయే కోడలు రాధిక మర్చంట్, కొడుకు అనంత్ ఏం చదువుకున్నారు..ఏం చేస్తున్నారో తెలుసుకుందాం.
Former WWE Superstar Michael Jones Passed Away: డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ రెజ్లర్, వర్జిల్ గా ప్రసిద్ధి చెందిన మైఖేల్ జాన్స్ కన్నుమూశారు.
PM Surya Ghar Yojana Apply Online: కోటి కుటుంబాలకు ఫ్రీ కరెంట్ అందించే పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజలీ యోజన పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి దాదాపు 17 లక్షల మంది నకిలీ ఓటర్ల జాబితాను ఈసీకి సమర్పించారు. నకిలీ ఓటర్ల జాబితాలతో కూడిన 24 బ్యాగులను తీసుకుని కార్యాలయానికి వెళ్లాడు. బీజేపీ గుర్తించిన నకిలీ ఓటర్ల సంఖ్య 16,91,132 అని ఆయన పేర్కొన్నారు.
Advertisment
తాజా కథనాలు