వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 14 శాతం ఓట్లు కూడా రావన్నారు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్వహించిన మహిళా ప్రగతి కోసం ప్రజా వేదిక కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా సాధికారతే ధ్యేయంగా తెలుగుదేశం ప్రభుత్వం మహిళా అభ్యున్నతికి ఎంతగానో కృషి చేసిందని తెలిపారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాలను కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

E. Chinni
మూడో తరగతి చదువుతోన్న బాలిక హోమ్ వర్క్ చేయలేదని.. ఒంటిపై వాతలు తేలేలా ఓ ఉపాధ్యాయుడు చితక బాదాడు. దీంతో బాలిక ఈ విషయాన్ని చెప్పగా.. ఇదేంటని ప్రశ్నించిన తల్లిదండ్రులకు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం పరిధిలోని శిఖరేశ్వరం సమీపంలో భక్తులను పరుగులు పెట్టించిన ఎలుగుబంటి ఎట్టకేలకు బోనులో చిక్కింది. శిఖరేశ్వరం అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న ఎలుగు బంటిని అటవీ శాఖ అధికారులు శుక్రవారం తెల్లవారు జామున పట్టుకున్నారు. కొద్ది రోజులుగా శిఖరం ఆలయం పరిసరాల్లో ఎలుగు బంటి సంచరిస్తూ హల్చల్ చేస్తూ భక్తులను హడలెత్తించింది. దీంతో అటవీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ అలెన్, రేంజర్ నరసింహులు 3 ప్రత్యేక బోనులు ఏర్పాటు చేశారు.
వైసీపీ ప్రభుత్వంపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. శాంతి భద్రతల్లో ఏపీ బీహార్ ని మించిపోయిందని, ఏపీ క్రైమ్ కి అడ్డగా మారిపోయిందని ధ్వజమెత్తారు. Pawan Kalyan Hot Comments on YCP government
వైసీపీకి గుడ్ బై చెప్పారు గన్నవరం కీలక నేత యార్లగడ్డ వెంకట్రావు. ఈ మేరకు శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించి అధికారికంగా యార్లగడ్డ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను అవమానాలను ఎదుర్కోవడానికే రాజకీయాల్లోకి వచ్చినట్లయిందని మీడియా ముందు వాపోయారు. వైసీపీలో ఉండగా ఒక్కసారి కూడా ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడిని కలవలేదన్నారు.Yarlagadda Venkata Rao Sensational Decision resigned YSRCP
కంచరపాలెం కప్పరాడ ప్రాంతానికి చెందిన గున్న హేమంత్(30) అనే యువకుడు ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొంతకాలం క్రితం లోన్ యాప్స్ నుంచి కొంత రుణం తీసుకున్నాడు. అయితే డబ్బులు సర్దుబాటు కాక సమయానికి డబ్బులు కట్టలేకపోయాడు. కొంత మొత్తమే తిరిగి చెల్లించాడు. డబ్బులు వచ్చాక మిగిలిన మొత్తాన్ని చెల్లించాలని అనుకున్నాడు. కానీ ఇంతలోనే లోన్ యాప్ నిర్వాహకులు అతడ్ని వేధించడం మొదలుపెట్టారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు. శుక్రవారం మంగళగిరి మెజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యారు. వసీపీ నేతలపై దాఖలు చేసిన పరువు నష్టం కేసులో వాంగ్మూలం ఇచ్చేందుకు ఆయన కోర్టుకు వెళ్లారు. ఆంధ్ర ప్రదేశ్ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళి, సింగళూరు శాంతి ప్రసాద్ పై లోకేష్ గతంలో పరువు నష్టం కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో శుక్రవారం యువగళం పాదయాత్రకు లోకేష్ విరామం ఇచ్చారు. తిరిగి శనివారం సాయంత్రం 4 గంటలకు పాదయాత్రను ప్రారంభించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చల్లని కబురు చెప్పింది భారత వాతావరణ శాఖ(ఐఎండీ). రేపటి నుంచి చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటన జారీ చేసింది. ఈ నెల 18వ తేదీన బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడేందుకు అనుకూల అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఈశాన్య బంగాళా ఖాతం దానికి ఆనుకుని ఉన్న మధ్య బంగాళా ఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది దక్షిణం వైపుకు వంగి ఉంది. దీని ప్రభావంతో రేపటికి ఉత్తర బంగాళా ఖాతం పరిసర ప్రాంతాల్లో..
ఏపీ సీఎం వైఎస్ జగన్ శుక్రవారం విజయవాడలో పర్యటించనున్నారు. విజయవాడలో నూతనంగా ఏర్పాటు చేసిన హయత్ ప్లేస్ హోటల్ ను ఆయన ప్రారంభించనున్నారు. ఉదయం 10.45 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సీఎం బయలు దేరనున్నారు. పర్యాటక రంగంలో అంత్యంత కీలకమైన స్టార్ హోటల్స్ స్థాపనలో ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన 'హయల్ ప్లేస్' విజయవాడ నగరంలో ఏర్పాటు చేసిన ఫోర్త్ స్టార్ హోటల్ ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.
Advertisment
తాజా కథనాలు