Teacher Beats 3rd class Students for not doing Home Work in West Godavari: చిన్న చిన్న విషయాలకే విద్యార్థులను చావ బాదుతున్నారు ఉపాధ్యాయులు. ఇలాంటి ఉదంతాలకు సంబంధించి చాలా ఘటనలు వెలుగు చూశాయి. సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. హోమ్ వర్క్ చేయలేదని, క్లాస్ రూమ్ లో నిద్రపోయారని, ఫీజులు చెల్లించలేదని.. ఇలా కారణం ఏదైనా కానీ.. పిల్లలపై వారి ప్రతాపాన్ని చూపిస్తున్నారు ఉపాధ్యాయులు. అకారణంగా వారిపై చేయి చేసుకుంటున్నారు.
పూర్తిగా చదవండి..Teacher Beats 3rd class Students: హోమ్ వర్క్ చేయలేదని చిన్నారిని చితకబాదిన హెడ్ మాస్టర్
పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం వల్లూరు ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. మూడవ తరగతి చదువుతున్న విద్యార్థిని షేక్ ఆయిషా ఇచ్చిన హోమ్ వర్క్ చేయలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన హెడ్ మాస్టారు శామ్యూల్ విచక్షణారహితంగా చిన్నారి అని కూడా చూడకుండా.. కర్రతో ఇష్టం వచ్చినట్లు.. ఒంటిపై వాతలు తేలేలా చితక బాదాడు. అనంతరం చిన్నారి ఏడుస్తూ స్కూల్ లో జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పింది. అది చూసిన చిన్నారి తల్లితండ్రులు మండిపడ్డారు. వెంటనే స్కూల్ కి వెళ్లి హెడ్ మాస్టారు శామ్యూల్ ను నిలదీశారు. అయినా హెడ్ మాస్టర్ శామ్యూల్ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. దీంతో తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Translate this News: