author image

E. Chinni

By E. Chinni

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా బనగానపల్లె మండల హుసేనాపురం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. బుధవారం మధ్యాహ్నం తరగతి గోడ ఒకటి కూలిపోయింది. అయితే ఆ సమయంలో భోజన విరామ సమయం కావడంతో విద్యార్థులు అందరూ బయటకు వెళ్లారు. అప్పుడు అక్కడ విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పెద్ద శబ్దంతో తరగతి గది గోడ కూలింది. పెద్ద పెద్ద బండరాళ్లు విద్యార్థులు ఉంచిన బ్యాగులపై పడ్డాయి.

By E. Chinni

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రాబాబు పర్యటన కొనసాగుతుంది. గురువారం చంద్రబాబు మండపేటలో పర్యటించారు. ఈ క్రమంలో స్థానిక సర్పంచులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. సర్పంచుల హక్కులను కాపాడుకునేందుకు పోరాటం చేయాలన్నారు. సీఎం జగన్ సర్పంచుల హక్కులను కాల రాస్తున్నారని ఫైర్ అయ్యారు.

By E. Chinni

విశాఖ దస్పల్లా హోటల్ లో 'జనవాణి' కార్యక్రమం మొదలైంది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఇందులో భాగంగా పవన్ ఉత్తరాంధ్ర ప్రజలతో మాట్లాడుతున్నారు. గ్రామంలో వారికి ఉన్న సమస్యలు, ఇబ్బందులు తెలుసుకుంటున్నారు పవన్ కళ్యాణ్.

By E. Chinni

విశాఖ పట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్లాల్సిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ రద్దు అయ్యింది. టెక్నికల్ రీజన్స్ తో ఈ రైలును గురువారం రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటన చేశారు. ఆగష్టు 17 ఉదయం 5.45కి ఈ రైలు బయలు దేరాల్సి ఉంది. ఈ రైలు ప్రత్యామ్నాయంగా మరో రైలును ఏర్పాటు చేశారు. ఇది ఉదయం 7 గంటలకు బయలు దేరింది. ఈ రైలు కేవలం వందే భారత్ స్టాపుల్లో మాత్రమే ఆగుతుందని రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రయాణికులకు ఏవైనా..

By E. Chinni

విజయవాడలో వింత ప్రేమ కథ వెలుగు చూసింది. ఇద్దరు పురుషుల మధ్య ప్రేమ చిగురించింది. ఇద్దరు బీఈడీ టీచర్లు ప్రేమించుకున్నారు. ఎంతలా అంటే ఏకంగా ప్రేమికుడి కోసం ట్రాన్స్ జెండర్ గా మారేంతగా. కట్ చేస్తే.. ట్రాన్స్ జెండర్ లా మారిన తర్వాత లవర్ ని వదిలేసి పారిపోయాడు ప్రేమికుడు. దీంతో మోసపోయానని గుర్తించిన ప్రేమికురాలు.. పోలీసులను ఆశ్రయించింది.

By E. Chinni

కృష్ణా జిల్లా పెడనలో ఓ వ్యక్తి పై ఇద్దరు వ్యక్తులు కత్తులతో దారుణంగా దాడి చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకం రేపింది. కప్పల దొడ్డికి చెందిన పంతం బలరాం అనే వ్యక్తి మంగళవారం ఉదయం రోజూ లాగే మార్నింగ్ వాకింగ్ చేస్తున్నాడు. ఇంతలో ఇద్దరు యువకులు అకస్మాత్తుగా వచ్చి బలరాంపై కత్తులతో దాడికి దిగారు. దీంతో తీవ్ర గాయాల పాలైన బలరం అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.

By E. Chinni

నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, స్వాతంత్రం.. నాటి స్వాతంత్ర్య సమరయోధుల పోరాట ఫలితమే అని పేర్కొన్నారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. మంగళవారం 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా నేల పాడులోని హైకోర్టు ప్రాంగణంలో జాతీయ జెండాను ఆయన ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ.. వివిధ మతాలు, వర్గాలు ఉన్నప్పటికీ అందరూ కలిసి స్వాతంత్య్రం కోసం ఏకతాటిపై పోరాడటం వల్లే బ్రిటీష్ వాళ్లను తరిమికొట్టామన్నారు.

By E. Chinni

తమ కూమార్తెను ప్రేమ వివాహం చేసుకున్నాడని.. దళిత కుటుంబపై దారుణంగా దాడికి పాల్పడ్డారు యువతి తల్లిదండ్రులు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. దర్శి మండలం బొట్లపాలెంకి చెందిన ఓ యువకుడు.. అదే గ్రామానికి చెందిన బ్రహ్మారెడ్డి, అతని భార్య పుల్లమ్మ కూతురు గత కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు ఒప్పుకోక పోవడంతో.. ఇద్దరూ ఇంట్లో నుంచి వెళ్లి పోయి పెళ్లి చేసుకున్నారు.

By E. Chinni

77వ స్వాతంత్ర్య దినోత్స వేడుకలు అంబరాన్నంటాయి. దేశ వ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్స వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో కూడా పంద్రాగష్టు వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో సీఎం జగన్ పతాకావిష్కరణ చేశారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసులకు మెడల్స్ ప్రదానం చేశారు సీఎం. అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులకు మెడల్స్ ప్రదాన సమయంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. గ్రే హౌండ్స్ కు చెందిన గౌరు నాయకుడుకు..CM Jagan Vijayawada

Advertisment
తాజా కథనాలు