ఆంధ్ర ప్రదేశ్ లో రెండు పంప్డ్ స్టోరేజి ప్రాజెక్ట్ ల ఏర్పాటుకు బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో ఒప్పందం కుదరనుంది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఈ ఒప్పందం జరగనుంది. ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (AP GENCO), కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (NHPC) సంయుక్తంగా.. ఈ ప్రాజెక్టులను నిర్మించాలని నిర్ణయించాయి. MOU For Two Pumped Storage Projects
E. Chinni
ఆంధ్రప్రదేశ్ లో పలు చోట్ల వర్షాలు కరిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఆనుకొని ఉన్న అల్పపీడన ద్రోణి కోస్తా భాగాలపై కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీని వలన దక్షిణ కోస్తా ఏపీలోనూ బుధ, గురు వారాల్లో అక్కడక్కడ తేలికపాటి చినుకులు ఒకటి లేదా రెండు చోట్ల పడే అవకాశం ఉందని అంచనా వేశారు. Heavy Rain Alert
తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర గన్నవరంలో కొనసాగుతోంది. నారా లోకేష్ పాదయాత్ర రూట్ ను పోలీసులు మార్చడంతో గన్నవరంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో హై టెన్షన్ నెలకొంది. ముందు రూట్ మ్యాప్ ప్రకారం ఎమ్మెల్యే వల్లభనేని ఆఫీసు ముందుగా లోకేష్ పాదయాత్ర వెళ్లాల్సి ఉంది. అయితే ఎమ్మెల్యే వంశీ.. ఆఫీసులోనే ఉండటంతో నారా లోకేష్ పాదయాత్ర అటువైపు వెళ్లకుండా పోలీసులు బార్కేడ్లు అడ్డుపెట్టారు.
ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకూ.. వంటింట్లో ఏదొక పని ఉంటూనే ఉంటుంది. ఉదయాన్నే టీ - కాఫీలతో మొదలయ్యే వంటింటి పని.. రాత్రి భోజనాల తర్వాత కూడా పూర్తవ్వదు. మరుసటిరోజు చేసుకోవచ్చని అలసటతో పడుకుంటాం. కొన్ని చిట్కాలను తెలుసుకుంటే.. మనం రోజూ చేసే పనుల్లో కొన్ని ఈజీగా పూర్తిచేసేయొచ్చు.
పవన్ ను అడ్డుకోవడం దారుణమైన చర్య అని కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. సోమవారం ఓటర్ చేతన్ మహాభియాన్ కార్యక్రమంలో వర్చువల్ గా ప్రసంగించిన బండి సంజయ్.. ఏపీ ప్రభుత్వంపై హాట్ కామెంట్స్ చేశారు. మద్యాన్ని నిషేధిస్తామని హామీలు ఇచ్చి మద్యం బాండ్లు రిలీజ్ చేస్తారా? అని ప్రశ్నించారు. తాగుబోతులను తాకట్టు పెట్టి అప్పు చేస్తోన్న ఏకైక సర్కార్ జగన్ దే అని ఆరోపించారు.
తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో గన్నవరం కీలక నేత యార్లగడ్డ వెంకట్రావు పసుపు కండువా కప్పుకున్నారు. యార్లగడ్డకు పార్టీ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు లోకేష్. నారా లోకేష్ తలపెట్టిన యువగళం పాదయాత్ర గన్నవరం నియోజక వర్గంలోకి ప్రవేశించింది. ఈ నేపథ్యంలో యార్లగడ్డ.. లోకేష్ తో సమావేశమై పార్టీలో చేరారు. ఆ తర్వాత యార్లగడ్డ-లోకేష్ మధ్య ప్రత్యేక సమావేశం జరిగింది.
తాను ఇప్పటికిప్పుడు చనిపోయినా పర్వాలేదని, తన కుటుంబాన్ని అంతా సెటిల్ చేశానని పోసాని చెప్పారు. తాను చనిపోయాక.. తన శవాన్ని కూడా ఇండస్ట్రీ వారికి చూపించకూడదని భార్యకు చెప్పినట్లు తెలిపారు. Posani Krishna Murali
మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే వరకు మార్గదర్శి సంస్థలపై ఎలాంటి దాడులు చేయవద్దని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. AP High Court
వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రభంజనం సృష్టిస్తుందని, ఏపీలో సీఎం జగన్ పాలన అధ్వాన్నంగా ఉందని జనసేన నాయకుడు, సినీ నటుడు పృథ్వీరాజ్ విమర్శించారు. కమెడియన్ పృథ్వీ రాజ్ సొంతంగా దర్శకత్వం వహిస్తూ రూపొందించిన 'కొత్త రంగుల ప్రపంచం' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఖమ్మం జిల్లా బోనకల్ వెళ్లారు. బోనకల్ లో టీవీ ఆర్టిస్ట్ బానోత్ శ్రీనివాస రావు ఇంటికి కొత్త రంగుల ప్రపంచం మూవీ యూనిట్ మొత్తం వెళ్లింది. Actor Prudhvi Raj Hot Comments
ట్లు వేయించుకోవాలన్న దుర్బుద్ధితో గత ప్రభుత్వం జీతాలు ఎన్నికల సమయంలో పెంచిందని దుయ్యబట్టారు ఆంధ్రప్రదేశ్ సీఎం వైస్ జగన్. సోమవారం విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన ఏపీఎన్జీవో మహా సభల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఉద్యోగులపై ప్రశంసల వర్షం కురిపించారు. ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే సమస్యలు వస్తాయని వారించినా తాము వెనకడుగు వేయలేదని అన్నారు. తాము నిజాయితీ, కమిట్మెంట్ తో అడుగులు వేశామన్నారు సీఎం. అలాగే పదవీ విరమణ వయసుని 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచామన్నారు.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/CM-Jagan-visit-to-Vijayawada-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/rains-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/FotoJet9-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/FotoJet7-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/FotoJet6-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/FotoJet5-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/FotoJet4-1-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/FotoJet4-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/FotoJet3-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/FotoJet2-jpg.webp)