మీ వంట ఇంటి పనులను త్వరగా అవ్వాలా.. ఈ చిట్కాలు మీకోసం!! ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకూ.. వంటింట్లో ఏదొక పని ఉంటూనే ఉంటుంది. ఉదయాన్నే టీ - కాఫీలతో మొదలయ్యే వంటింటి పని.. రాత్రి భోజనాల తర్వాత కూడా పూర్తవ్వదు. మరుసటిరోజు చేసుకోవచ్చని అలసటతో పడుకుంటాం. కొన్ని చిట్కాలను తెలుసుకుంటే.. మనం రోజూ చేసే పనుల్లో కొన్ని ఈజీగా పూర్తి చేసేయొచ్చు. By E. Chinni 21 Aug 2023 in లైఫ్ స్టైల్ Scrolling New Update షేర్ చేయండి Simple Kitchen Tips for You in Telugu: ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకూ.. వంటింట్లో ఏదొక పని ఉంటూనే ఉంటుంది. ఉదయాన్నే టీ - కాఫీలతో మొదలయ్యే వంటింటి పని.. రాత్రి భోజనాల తర్వాత కూడా పూర్తవ్వదు. మరుసటిరోజు చేసుకోవచ్చని అలసటతో పడుకుంటాం. కొన్ని చిట్కాలను తెలుసుకుంటే.. మనం రోజూ చేసే పనుల్లో కొన్ని ఈజీగా పూర్తిచేసేయొచ్చు. మరి ఆ వంటింటి చిట్కాలేంటో తెలుసుకుందామా ? -పచ్చిమిరపకాయలను ఫ్రిడ్జ్ లో ఉంచినా.. అవి ఎరుపు రంగులోకి మారుతుంటాయి. పచ్చిమిర్చి అలా త్వరగా పండిపోకుండా.. ఎక్కువరోజులు నిల్వ ఉండాలంటే.. వాటిని పసుపులో కలిపి సీసాలో పెట్టుకోవాలి. ఇలా చేస్తే త్వరగా ఎర్రగా అవ్వకుండా ఉంటాయి. -కల్లుప్పును జాడీలో లేదా డబ్బాలో ఉంచినా.. నీరు కారిపోతుంటుంది. ఉప్పు ఉంచిన జాడీలో రెండు పచ్చిమిరపకాయలు వేస్తే నీరుకారిపోకుండా ఉంటుంది. -పెరుగు రుచిగా.. గట్టిగా తోడుకోవాలంటే.. తోడువేసే ముందు గిన్నెను పటిక ముక్కతో రుద్దండి. అలాగే పెరుగు పుల్లగా ఉండకుండా ఉండాలంటే.. తోడువేసేటపుడే అందులో ఒక చిన్న కొబ్బరిముక్క వేయండి. -వెల్లుల్లి రెబ్బలకు ఉన్న పొట్టును సులువుగా తీయాలంటే వాటిలో 3-4 చుక్కల నూనె వేసి కలిపి, 5 నిమిషాల తర్వాత తీయండి. లేదా బాగా ఎండ కాచినపుడు కొద్దిసేపు వాటిని ఎండలో ఉంచితే.. పొట్టు సులభంగా వస్తుంది. -దోసెలు వేసేటపుడు.. ఒక్కోసారి దోసెపిండి పెనంకు అతుక్కుపోయి.. దోసెలు చిరిగిపోతుంటాయి. అలా చిరగకుండా దోసెలు పలుచగా రావాలంటే.. దోసెలపిండి గ్రైండ్ చేసేటపుడే ఒక కప్పు సగ్గుబియ్యం కూడా వేసి రుబ్బుకోవాలి. దోసె వేసే ముందు పెనంపై వంకాయ ముక్కతో రుద్దినా దోసెలు అతుక్కుపోకుండా వస్తాయి. -కేక్ తయారు చేసేటపుడు ఆ బ్యాటర్ లో ఒక స్పూన్ గ్లిసరిన్ కలిపితే ఎక్కువకాలం కేక్ తాజాగా ఉంటుంది. -జామ్ సీసాలో జామ్ గడ్డకడితే.. నాలు స్పూన్ల గోరువెచ్చని నీరు పోస్తే చాలు. దీని వల్ల జామ్ మెత్తబడుతుంది. -ఆమ్లెట్ వేసేటపుడు.. కోడుగుడ్డు సొనలో ఒక స్పూన్ నీళ్లు కలిపితే.. ఆమ్లెట్ మెత్తగా వస్తుంది. ఎగ్స్ ఉడికించడానికి 2 గంటల ముందుగానే ఫ్రిడ్జ్ లో నుంచి తీసి ఉంచితే.. అవి పగలకుండా ఉంటాయి. అలాగే పెంకుకు గుడ్డు అతుక్కోకుండా ఉంటుంది. #kitchen-tips #easy-kitchen-tips-for-you #telugu-simple-kitchen-tips-for-you #simple-kitchen-tips-for-you #easy-kitchen-tips #simple-kitchen-tips-for-you-in-telugu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి