AP High Court: మార్గదర్శి సంస్థలపై దాడులు చేయొద్దు: ఏపీ హైకోర్టు ఆదేశాలు

మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే వరకు మార్గదర్శి సంస్థలపై ఎలాంటి దాడులు చేయవద్దని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మార్గదర్శి సంస్థలపై పలు ప్రభుత్వ శాఖలు ఇటీవల దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడులను నిరసిస్తూ మార్గదర్శి యాజమాన్యం హైకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్ పై సోమవారం ఏపీ హైకోర్టు విచారణ చేసింది. మార్గ దర్శి తరపున సీనియర్ న్యాయవాదులు నాగముత్తు, మీనాక్షి అరోరా వాదనలు వినిపించారు. వాదనల అనంతరం మధ్యంతర ఉత్తర్వుల కోసం హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఉత్తర్వులు ఇచ్చేంత వరకు మార్గదర్శి సంస్తలపై ఎలాంటి దాడులు చేయవద్దని న్యాయ స్థానం ఆదేశాలు జారీ చేసింది.

New Update
Margadarshi Case: మార్గదర్శికి ఊరట.. ఆ పిటిషన్ ను సస్పెండ్ చేసిన హైకోర్టు

AP High Court orders not to attack on Margadarsi Institutions: మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే వరకు మార్గదర్శి సంస్థలపై ఎలాంటి దాడులు చేయవద్దని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మార్గదర్శి సంస్థలపై పలు ప్రభుత్వ శాఖలు ఇటీవల దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడులను నిరసిస్తూ మార్గదర్శి యాజమాన్యం హైకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్ పై సోమవారం ఏపీ హైకోర్టు (AP High Court) విచారణ చేసింది. మార్గ దర్శి తరపున సీనియర్ న్యాయవాదులు నాగముత్తు(Nagamuthu), మీనాక్షి అరోరా(Meenakshi Arora) వాదనలు వినిపించారు. వాదనల అనంతరం మధ్యంతర ఉత్తర్వుల కోసం హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఉత్తర్వులు ఇచ్చేంత వరకు మార్గదర్శి సంస్తలపై ఎలాంటి దాడులు చేయవద్దని న్యాయ స్థానం ఆదేశాలు జారీ చేసింది.

ఏపీ సీఐడీ అధికారులపై లుకౌట్ సర్క్యులర్ జారీ:

మార్గదర్శి చిట్ ఫండ్స్ కంపెనీ ఎండీ శైలజా కిరణ్ దాఖలు చేసిన ధిక్కరణ పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. కఠిన చర్యలు తీసుకోవద్దని మార్చి 21న తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఉల్లంఘించి.. రూ.1035 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేశారని మార్గదర్శి చిట్ ఫండ్స్ పిటిషన్ దాఖలు చేసింది. ఆస్తుల అటాచ్ కూడా కఠిన చర్యనే కాబట్టి.. ఆ ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ హోం శాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తాపై, ఏపీ సీఐడీ (AP CID) అదనపు డీజీ ఎన్ సంజయ్, అదనపు ఎస్పీలు ఎస్ రాజశేఖర్ రావు, సీహఎచ్ రవికుమార్ పై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని పిటిషన్ లో మార్గదర్శి చిట్ ఫండ్స్ కోరింది. మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ పిటిషన్ పై కోర్టు విచారణ జరిగింది.

దీంతో కోర్టు సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఈ నెల 18వ తేదీన కోర్టు ధిక్కరణ కేసుల్లో ఏపీ సీఐడీ అధికారులు తెలంగాణ హైకోర్టులో హాజరయ్యారు. దర్యాప్తు కోసం పరిస్థితులను బట్టి మార్గదర్శి ఎండీపై లుకౌట్ సర్క్యులర్ ఇవ్వాల్సి వచ్చిందన్న సీఐడీ అధికారుల వాదనపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. పరిస్థితులు ఏమైనప్పటికీ.. కోర్టు ఆదేశాలు ఉన్నాయి కదా అని వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 15వ తేదీకి తెలంగాణ కోర్టు వాయిదా వేసింది.

Also Read: ఏ ఒక్క ఉద్యోగికి తమ ప్రభుత్వం అన్యాయం చేయలేదు: సీఎం జగన్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు