author image

E. Chinni

By E. Chinni

అనంతపురంలోని తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. తాడిపత్రిలోని జూనియర్ కళాశాల ప్రహరీ గోడ నిర్మాణం విషయంలో గత వారం రోజులుగా ఉద్రిక్తత కొనసాగుతోంది. తాజాగా దీనిపై మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి మీడియా ముందుకు వచ్చారు. దీంతో ఈ వివాదం మరింత వేడెక్కింది. ఈ వ్యవహారంపై జేసీకి పోలీసులు 41 సీఆర్పీసీ నోటీసులు ఇచ్చారు. అయితే ఈ నోటీసు తీసుకోవడానికి ఆయన నిరాకరించారు. ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రహరీ గోడ నిర్మాణ పనులు ఆపాలని తాను ఎక్కడా అనడం లేదన్నారు.

By E. Chinni

రాబోయే చంద్రన్న ప్రభుత్వంతో ప్రజల సమస్యలన్నీ పరిష్కారమవుతాయని వెల్లడించారు తెలుగు దేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. యువగళం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తోన్న నారా లోకేష్ పాదయాత్ర.. విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్ నుంచి ఆదివారం సాయత్రం ప్రారంభమైంది. యువనేత లోకేష్ కు మద్దతు ఇస్తూ యువతీ యవకులు భారీగా రోడ్లపైకి తరలి వస్తున్నారు. అడుగడుగునా లోకేష్ కు విజయవాడ ప్రజలు లోకేష్ కు ఆత్మీయ స్వాగతం పలికారు. తనను కలిసేందుకు వచ్చిన ప్రజలను లోకేష ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలు తెలుసుకుంటున్నారు.

By E. Chinni

ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అల్లూరు జిల్లా పాడేరు ఘాట్ రోడ్డు వ్యూ పాయింట్ వద్ద ఆర్టీసీ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. చెట్టుని తప్పించబోయి లోయలో పడ్డ ఆర్టీసీ బస్సు. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మోదమాంబ పాదాలకు మూడు కిలో మీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే ప్రమాదం జరిగిన బస్సులో సుమారు 25 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. సుమారు 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. బస్సు చోడవరం నుంచి పాడేరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

By E. Chinni

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును యార్లగడ్డ వెంకట్రావు ఆదివారం ఉదయం ఆయన నివాసంలో కలిశారు. ఇరువురూ కొద్దిసేపు చర్చలు జరిపారు. ఈ నెల 22న గన్నవరం సభలో యార్లగడ్డ వెంకట్రావు తెలుగు దేశం పార్టీ కండువా కప్పుకోనున్నారు. అనంతరం యార్లగడ్డ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. డబ్బు సంపాదించాలని తాను రాజకీయాల్లోకి రాలేదన్నారు. ఆరేళ్లుగా వైసీపీకి సేవ చేశానని, మూడున్నర ఏళ్లుగా వైసీపీలో ఎన్నో చూశానన్నారు యార్లగడ్డ.

By E. Chinni

మనం రోజూ ఉపయోగించుకునే నిత్యవసర వస్తువుల్లో ఉల్లిపాయ ఒకటి. ఉల్లి తినడం వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ఉల్లిపాయ కేవలం కూరలకే కాదు.. అలాగే ఉల్లిపాయ జుట్టు, చర్మానికి సంబంధించిన సమస్యలను తగ్గించడంలో కూడా అద్భుతంగా పని చేస్తుంది. ముఖ్యంగా ఉల్లి రసం జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది. ఉల్లిలో విటమిన్లు ఏ, బి, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం వంటి ఖనిజాలు ఉంటాయి. అలాగే ఉల్లి రసంలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది.

By E. Chinni

తెలుగు రాష్ట్రాలకు మళ్లీ వర్ష సూచనను జారీ చేసింది భారత వాతావరణ శాఖ(ఐఎండీ). బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాతుందని.. దీని ప్రభావంతో మరో రెండు రోజుల పాటు ఇదే విధంగా వర్షాలు కురుస్తాయని, ఐదు రోజుల తర్వాతే పూర్తిగా తగ్గుముఖం పట్టి.. తెలుగు నాట వాతావరణం పొడిగా మారుతుందని పేర్కొంది వాతావరణ శాఖ. మళ్లీ కొంత కాలం తర్వాత తెలుగు రాష్ట్రాల్లో వర్షపు చినుకులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వాయువ్య బంగాళా ఖాతంలో అల్పపీడనం కారణంగా తెలంగాణ, ఏపీలో వర్షాలు పడుతున్నాయి.

By E. Chinni

ఎన్టీఆర్ జిల్లాలోని విస్సన్న పేటలో విషాద ఘటన చోటు చేసుకుంది. 24 గంటల వ్యవధిలోనే తల్లి, కొడుకు మృతి చెందారు. కన్న తల్లి మరణ వార్త విని కొడుకు మృతి చెందాడు. శుక్రవారం ఉదయం తల్లి ఆస్పత్రిలో మృతి చెందగా.. శనివారం సాయంత్రం తల్లి మరణం తట్టుకోలేక కొడుకు ఇంట్లోనే గుండెపోటుతో మరణించాడు.దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

By E. Chinni

రాష్ట్ర రైతాంగం తీవ్ర సంక్షోభంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu). ఒక్క రోజే ఉమ్మడి కర్నూలు జిల్లాలో నలుగురు రైతులు బలవన్మరణాలు పొందడంపై ఆందోళన చెందారు. ఈ సందర్భంగా ఆదివారం చంద్రబాబు మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రదేశ్ లో ఏ ప్రాంతంలో పర్యటనకు వెళ్లినా రైతు కష్టాలు, రైతాంగ సమస్యలు కనిపిస్తున్నాయన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో నలుగురు రైతులు బలవన్మరణాలు పొదడం ఆవేదన కలిగించిందన్నారు చంద్రబాబు.

By E. Chinni

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో గన్నవరం సీనియర్ నేత యార్లగడ్డ వెంకట్రావు కాసేపట్లో భేటీ కానున్నారు. దీంతో వీరి భేటీపై ప్రాధాన్యత సంతరించుకుంది. చంద్రబాబుతో భేటీ కోసం ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు యార్లగడ్డ వెంకట్రావు. ఈ నెల 22వ తేదీన గన్నవరంలో యార్లగడ్డ పసుపు కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది.

By E. Chinni

వైపీపీ ప్రభుత్వం వచ్చాక కాలుష్య కారక వ్యర్థాల నియంత్రణలో చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. శనివారం తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి పొల్యుషన్ కంట్రోల్ బోర్డు రీజనల్ ఆఫీస్ & ల్యాబరేటరిని ప్రారంభించారు. ఈ భవనానికి డాక్టర్ వైఎస్సార్ పర్యావరణ భవనంగా నామకరణం చేశారు. రూ.16.50 కోట్లతో ఈ నూతన భవనాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్ పర్యావరణంపై ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని మార్పులు తెచ్చారన్నారు.

Advertisment
తాజా కథనాలు