తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో ఓ బాణాసంచా తయారీ కార్మాగరంలో పేలుడు చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో 10 మంది కార్మికులు మృతి చెందారు. ఇందులో నలుగురు మహిళలు కూడా ఉన్నారు. మానవతప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
కొన్ని బ్యాంకులను మోసం చేసిన కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌కు.. న్యూయార్క్ కోర్టు 354 మిలియన్ డాలర్ల ( రూ.2900 కోట్లకు పైగా) భారీ జరిమానాను విధించింది. ఆయన మూడేళ్ల పాటు న్యూయార్క్‌కు చెందిన ఏ సంస్థల్లో కూడా ఆఫీసర్ లేదా డైరెక్టర్‌గా ఉండకుండా నిషేధించింది.
Joe Biden : రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రతర్థి నావల్ని మరణంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. నావల్ని మరణానికి పుతినే బాధ్యుడు అంటూ ఆరోపించారు. మరోవైపు నావల్ని భార్య కూడా ఆయన మృతిపై అనుమానం వ్యక్తం చేశారు. ఇది నిజమైతే పుతిన్ శిక్ష నుంచి తప్పించుకోలేరని అన్నారు.
Ravichandran Ashwin : ఇంగ్లాడ్ - భారత్ జట్ల మధ్య మూడో టెస్ట్ జరుగుతున్న నేపథ్యంలో కీలక బౌలర్ అశ్విన్ మ్యాచ్ నుంచి వైదొలగిన విషయం తెలిసిందే. తన తల్లికి ఆరోగ్యం బాలేకపోవడంతో అశ్విన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. ఈ సమయంలో అతడికి అండగా ఉంటామని తెలిపింది.
కరీనంగర్ రెండో టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఓ మహిళ ఫిర్యాదు చేయడానికి వస్తే.. పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోవడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించింది. పోలీసులు తీరు మార్చుకోవాలని తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పుడు కేసు నమోదు చేయాల్సిందేనని స్పష్టం చేసింది.
ఎన్నారైలు, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియాతో ముడిపడిన మోసపూరిత వివాహాలపై న్యాయ కమిషన్ స్పందించింది. ఇలాంటి వాటిని అరికట్టేందుకు పాస్‌పోర్టు చట్టం,1967లో అవసరమైన సవరణలు తీసుకురావాలని కేంద్రానికి సూచనలు చేసింది.
ఎలాన్ మస్క్‌కు సంబంధించి ఫిబ్రవరి 15న ఓ నివేదిక కీలక విషయాన్ని బయటపెట్టింది. ఆయన సెకన్‌కు 114.80 డాలర్లు(రూ.9,528) , నిమిషానికి 6,887( రూ.5,71,704) డాలర్లు, గంటకు 413,220 డాలర్లు (రూ.34,297,260) సంపాదిస్తున్నట్లు పేర్కొంది.