Sachin-Djokovic-Smith: క్రికెట్ దేవుడికి టెన్నిస్ లెజెండ్ స్వీట్ రిప్లై.. వైరల్ ట్వీట్! ఆస్ట్రేలియన్ ఓపెన్ ఎడిషన్ స్టార్ట్‌కు ముందు కోర్టులో జకోవిచ్, స్టీవ్ స్మిత్ క్రికెట్‌తో పాటు టెన్నిస్ ఆడిన విషయం తెలిసిందే. ఈ వీడియోను చూసిన సచిన్.. 'లవ్ ఆల్' అని ట్వీట్ చేయగా.. దానికి జకోవిచ్ 'నమస్కారం' ఎమోజీతో రిప్లై ఇచ్చాడు. By Trinath 13 Jan 2024 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి క్రీడాకారులు ఎంతో స్పోరిటివ్‌గా ఉంటారు. వారి దగ్గర నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. అన్‌ఫీల్డ్‌లో పోరాడాలన్నా ఆఫ్ ఫీల్డ్‌లో ఒకరినొకరు గౌరవించుకోవాలన్నా అది క్రీడాకారులకే చెల్లుతుంది. ముఖ్యంగా క్రికెట్‌లో సచిన్ ఎంతో హూందాగా ఉంటాడు. క్రికెట్‌తో పాటు ఇతర క్రీడాల పట్ల ఎంతో ఇష్టాన్ని చూపించే సచిన్(Sachin).. మరోసారి అదే చేశాడు. ఈసారి సచిన్ చేసిన ట్వీట్‌గా టెన్నిస్ లెజెండరీ ప్లేయర్ నొవాక్ జకొవిచ్(Djokovic) రియాక్ట్ అయ్యారు. నమస్కారాలు పెడుతూ సచిన్ ట్వీట్‌ను రీట్వీట్ చేశాడు. 🙏🙏🙏 https://t.co/7NO9Koxsrk — Novak Djokovic (@DjokerNole) January 12, 2024 అసల మేటరేంటి? ఆదివారం ప్రారంభం కానున్న ఆస్ట్రేలియన్ ఓపెన్(Australian Open) 2024 ఎడిషన్‌కు ముందు కోర్టులో టెన్నిస్ స్టార్ నోవాక్ జకోవిచ్, క్రికెట్ స్టార్ స్టీవ్ స్మిత్(Steve Smith) కలిసి గేమ్స్ ఆడారు. టెన్నిస్‌తో పాటు సరదగా ఇద్దరూ క్రికెట్ ఆడారు. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. 34 ఏళ్ల స్మిత్ మెల్‌బోర్న్ పార్క్‌ను సందర్శించాడు,. అక్కడ క్రికెట్ బ్యాట్‌తో సరదాగా గడిపిన జకోవిచ్‌తో కలిసి టెన్నిస్ ఆడాడు. స్మిత్, జకోవిచ్ మధ్య స్నేహాన్ని చూసిన టెండూల్కర్ తన ఆనందాన్ని తనదైన స్టైల్‌లో చూపించాడు. 'ఇద్దరు నిష్ణాతులైన క్రీడాకారులు ఒక క్షణం గడపడం చాలా అందంగా ఉంది. స్కోరు 'లవ్-ఆల్' అని సచిన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఈ ట్వీట్‌కు జకోవిచ్ రియాక్ట్ అయ్యాడు. సచిన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ 'నమస్కారం' ఎమోటికాన్‌తో రిప్లై ఇచ్చాడు. Steve Smith 🤝Novak Djokovicpic.twitter.com/TuLGBV2QJD — CricTracker (@Cricketracker) January 11, 2024 జకోవిచ్ విషయానికొస్తే, తొమ్మిది ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిళ్లను గెలుచుకున్న అతను హార్డ్-కోర్ట్ టోర్నమెంట్‌కు టాప్ ఫేవరెట్‌గా ఉన్నాడు. 36 ఏళ్ల జకో తొలి రౌండ్‌లో క్రొయేషియాకు చెందిన డినో ప్రిజ్మిక్‌తో తలపడనున్నాడు. అటు స్మిత్ ప్రస్తుతం బిగ్ బాష్ లీగ్ (BBL) ఎడిషన్ కోసం ఇటీవల సిడ్నీ సిక్సర్స్‌లో చేరాడు. ఇక పాకిస్థాన్‌తో జరిగిన సిడ్నీ టెస్ట్ తర్వాత డేవిడ్ వార్నర్ టెస్టు ఫార్మాట్ నుంచి రిటైర్ అయిన విషయం తెలిసిందే. దీంతో స్టీవ్ స్మిత్‌ను ఓపెనర్‌గా పంపాలని జట్టు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. వెస్టిండీస్‌తో జనవరి 17 నుంచి అడిలైడ్ ఓవల్‌లో జరగనున్న తొలి టెస్టులో స్మిత్ ఆడనున్నాడు. Novak Djokovic & Steve Smith playing tennis 🎾 pic.twitter.com/nENHhxzArd — Shubhankar Mishra (@shubhankrmishra) January 11, 2024 Also Read: మళ్లీ అదే స్ట్రాటజీ.. యువకులతోనే ఇంగ్లండ్‌పై బరిలోకి.. టెస్టు జట్టు ప్రకటన! WATCH: #sachin-tendulkar #sports-news #novak-djokovic #steve-smith #australian-open-2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి