August 2024 GST Collection : ఆగస్టు నెలలో తగ్గిన జీఎస్టీ వసూళ్లు.. ఎంతంటే..  

ఆగస్టులో GST వసూళ్లు గత నెలతో పోలిస్తే 10 శాతం తగ్గాయి. ఇది నికర పన్ను వసూళ్లలో 6.5 శాతం తక్కువ. గతేడాది ఇదే నెలతో పోలిస్తే జీఎస్టీ వసూళ్లు ఎక్కువ. ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఆగస్టులో మొత్తం జీఎస్టీ వసూళ్లు రూ.1.74 లక్షల కోట్లుగా ఉన్నాయి

New Update
GST Collections: రికార్డ్ సృష్టించిన జీఎస్టీ కలెక్షన్స్.. ఈ లెక్కలు చూస్తే మతిపోతుంది!

August 2024 GST Collection Dropped : ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం ఆగస్టు నెలలో జీఎస్టీ (GST) లో మొత్తం రూ.1,74,962 కోట్లు వసూలయ్యాయి. గతేడాది ఆగస్టు నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1.59 లక్షల కోట్లు. దానితో పోలిస్తే పన్నుల వసూళ్ల శాతం 10 శాతం పెరిగింది. అయితే ఆగస్టుకు ముందు నెల జూలైలో జీఎస్టీ వసూళ్లు రూ.1,82,075 కోట్లు. దానితో పోలిస్తే జీఎస్టీ వసూళ్లు స్వల్పంగా తగ్గాయి.

ఒక్క నెలలో 2.10 లక్షల కోట్ల పన్ను వసూలు కావడం ఇప్పటి వరకు రికార్డుగా ఉంది.  ఇది ఏప్రిల్ 2024 నెలలో జరిగింది. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు వసూలైన జీఎస్టీ పన్ను మొత్తం రూ.9.13 లక్షల కోట్లు. 2023 ఇదే కాలంలో పన్ను వసూళ్లు రూ.8.29 లక్షల కోట్లుగా ఉన్నాయి. 

ఆగస్టు నెలలో రీఫండ్ మొత్తం రూ. 24,460. అంతకుముందు సంవత్సరం ఆగస్టుతో పోలిస్తే, వాపసు శాతం 38 శాతం పెరిగింది. రీఫండ్‌లు మినహా నికర GST వసూళ్లు మొత్తం పన్ను వసూళ్లలో రూ. 1.5 లక్షల కోట్లు. గత ఏడాదితో పోలిస్తే ఈ నికర వసూళ్లు శాతం. 6.5 శాతం కంటే తక్కువగా ఉన్నట్లు గుర్తించారు.

ఆగస్టు నెలలో వచ్చిన మొత్తం పన్ను రూ.1.74 లక్షల కోట్లలో అంతర్గత వ్యవహారాల నుంచి రూ.1.25 లక్షల కోట్లు వచ్చాయి. ఈ పన్ను వసూళ్లు 9.2 శాతం పెరిగాయి. ఇంకా, దిగుమతి చేసుకున్న వస్తువులపై పన్ను రూ.49,976 కోట్లు. ఈ శాతంలో 12.1 శాతం పెరిగింది.

రాష్ట్రాల వారీగా జీఎస్టీ వసూళ్ల వివరాలను ప్రతి నెలా అందించేవారు.  అయితే, ఈసారి అది విడుదల కాలేదు. గత రికార్డుల ప్రకారం మహారాష్ట్ర (Maharashtra) అత్యధిక జీఎస్టీని వసూలు చేస్తోంది. ఆ తర్వాతి స్థానం కర్ణాటక. తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలు కూడా అధిక పన్నులు వసూలు చేస్తాయి.

Also Read : అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు.. మరో 2 రోజుల పాటు..

Advertisment
తాజా కథనాలు