వరద ప్రాంత ప్రజలకు మరో రెండు రోజుల వరకూ అందచేసే ఆహార పదార్థాలను సిద్ధం చేసుకోవాలని సీఎం నారా చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. బుడమేరు ముంపు ప్రాంతాలతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో వరద పరిస్థితిపై ఆయన నేడు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. విజయవాడలోని సింగ్ నగర్, జక్కంపూడి, శ్రీనగర్, శారదా సెంటర్, కృష్ణలంక, మిల్క్ ఫ్యాక్టరీ, రాజరాజేశ్వరీపేట ప్రాంతాల్లో మూడు లక్షల ఆహార పొట్లాలను పంపిణీ చేసినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. విజయవాడ ప్రాంతంలో తెల్లవారు జాము వరకూ ఆకస్మిక పర్యటనలు చేసి వరద సహాయంపై ఆరా తీసిన చంద్రబాబు ఉదయం జిల్లా కలెక్టరేట్ లో ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో మంత్రి వంగలపూడి అనిత, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
AP Floods: అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు.. మరో 2 రోజుల పాటు..
రాష్ట్రంలో వరద పరిస్థితులపై సీఎం చంద్రబాబు కొద్ది సేపటి క్రితం అధికారులతో మరోసారి సమీక్ష నిర్వహించారు. వరద ప్రాంత ప్రజలకు మరో రెండు రోజుల వరకూ అందచేసే ఆహార పదార్థాలను సిద్ధం చేయాలని ఆదేశించారు.
Translate this News: