ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురంలో విషాదం చోటుచేసుకుంది. నదిలో మునిగిపోతున్న తండ్రిని కాపాడబోయి కూతురు మృతి చెందింది. ఇక వివరాల్లోకి వెల్తే.. కమలాపురం సమీపంలో ఉన్న గోదావరి నది వద్దకు నిఖిత అనే అమ్మయి.. తన తండ్రితో కలిసి వెళ్లింది. ముందుగా తండ్రి సరదాగా స్నానం చేసేందుకు గోదావరిలో దిగాడు. అయితే లోతు ఎక్కువగా ఉండటంతో అతను మునిగిపోతుండగా.. ఒడ్డున ఉన్న కూతురు చేయి అందించి బయటికి లాగింది.
Also read: 1.10 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్ళు.. 25 ని.ల్లోనే పట్టుకున్న హైదరాబాద్ పోలీసులు
కానీ ఇదే క్రమంలో బండమీద ఉన్న నిఖిత కాలుజారింది. దీంతో ఆమె గోదావరిలో పడి మునిగిపోయి చనిపోయింది. కూతురు మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: కోవిషీల్డ్‌తో సైడ్ ఎఫెక్ట్స్.. అంగీకరించిన ఆస్ట్రాజెనెకా