Iran-Israel War : ఇరాన్-ఇజ్రాయెల్‌ మధ్య హై టెన్షన్‌.. ఇజ్రాయెల్‌పై విరుచుకుపడ్డ హిజ్బుల్లా!

మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఓ వైపు ఇరాన్, ఇజ్రాయెల్‌ మధ్య టెన్షన్‌ ఫైట్ నడుస్తుంటే.. మరోవైపు ఇజ్రాయెల్‌పై లెబనాన్‌ మిలిటెంట్‌ గ్రూప్‌ హిజ్బుల్లా భీకరమైన దాడులు చేసింది. ఇజ్రాయెల్ ఆర్మీ హెడ్‌ ఆఫీసు టార్గెట్‌గా విరుచుకుపడింది.

New Update
Iran-Israel War : ఇరాన్-ఇజ్రాయెల్‌ మధ్య హై టెన్షన్‌.. ఇజ్రాయెల్‌పై విరుచుకుపడ్డ హిజ్బుల్లా!

Hizballah : మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఓ వైపు ఇరాన్, ఇజ్రాయెల్‌(Iran-Israel War) మధ్య టెన్షన్‌ ఫైట్ నడుస్తుంటే.. మరోవైపు ఇజ్రాయెల్‌పై లెబనాన్‌ మిలిటెంట్‌ గ్రూప్‌ హిజ్బుల్లా భీకరంగా విరుచుకు పడింది. ఇజ్రాయెల్ ఆర్మీ హెడ్‌ ఆఫీసు టార్గెట్‌గా హిజ్బుల్లా దాడులకు పాల్పడింది. హిజ్బుల్లా మిలిటెంట్లకు ఇరాన్ ఆర్మీ(Iran Army) ఆర్థిక సాయం చేస్తోందని ఇజ్రాయెల్ అధికారులు ఆరోపిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Sexual assault: చిన్నారులపై లైంగిక దాడి.. కామాంధుడిని కాల్చి చంపిన పోలీసులు: వీడియో!

ఇజ్రాయెల్‌ చొరబాట్లను నిరసిస్తూ..
ఈ మేరకు లెబనాన్‌(Lebanon) గ్రామాల్లోకి ఇజ్రాయెల్‌ చొరబాట్లను నిరసిస్తూ దాడికి పాల్పడ్డట్లు లెబనాన్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ(National News Agency) తెలిపింది. ఈ క్రమంలో హిజ్బుల్లా దాడులను ధృవీకరించిన ఇజ్రాయెల్ సైన్యం.. అనంతరం హిజ్బుల్లా స్థావరాలపై వరుస బాంబులతో విరుచుకుపడింది. ఈ ఫైట్ లో హిజ్బుల్లాకు చెందిన ఇద్దరు కీలక మిలిటెంట్లను హతమార్చిన IDF పేర్కొంది. ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచే ఇజ్రాయెల్ టార్గెట్‌గా హిజ్బుల్లా మిలిటెంట్ల దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు