Eluru : ఏలూరు జిల్లాలో వైసీపీ-టీడీపీ(YCP-TDP) కార్యకర్తలు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఏలూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్(Karumuri Sunil Kumar Yadav) కారు పై టీడీపీ నాయకులు కొందరు దాడికి పాల్పడ్డారు. ఆదివారం రాత్రి ముసునూరు మండలానికి ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న సునీల్ కారును టీడీపీ కార్యకర్తలు అడ్డుకుని దాడికి పాల్పడ్డారు.
ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. రంగాపురం గ్రామం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఏలూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్, సొంగ రోషన్, చింతమనేని ప్రభాకర్ ఏర్పాటు చేసిన కమ్మ ఆత్మీయ సమావేశంలో హాజరైన వారి వర్గీయులే ఈ దాడికి పాల్పడినట్టు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఈ ఘటనపై స్పందించిన ఏలూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్. కూటమి కమ్మ ఆత్మీయ సమావేశానికి వచ్చిన టీడీపీ, జనసేన(Janasena) శ్రేణులు నాపై దాడి చేశారని ఆరోపించారు. నా కారుపై దాడి చేసి, రెండు కార్లను కర్రలతో అద్దాలు పగలకొట్టారు. అధికారంలో లేకపోతేనే ఇంతటి అరాచకానికి తెగబడుతున్నారు అని ఫైర్ అయ్యారు.
హుందాగా రాజకీయాలు చేయాలి.. కానీ, మా సహనాన్ని పరీక్షిస్తే, మేం తలచుకుంటే ఇంట్లోంచి అడుగు కూడా బయటపెట్టలేరని వార్నింగ్ ఇచ్చారు. ఓడిపోతున్నాం అన్న భయంతోనే మా పై దాడులకు పాల్పడుతున్నారు.. దెందులూరు నియోజకవర్గంలో అయితే రోజూ అరాచకాలు సృష్టిస్తున్నారని విమర్శించారు ఏలూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్.
Also read: బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పాడేకి గుండెపోటు..కారణం ఆ వ్యాక్సినేనా?