ప్రొద్దుటూరులో దారుణం.. నమ్మి వచ్చిన వ్యక్తిని హత్య చేసిన స్నేహితుడు

ప్రస్తుత సమాజంలో స్నేహ బంధానికి విలువ లేకుండా పోతోంది. మనం ఆపదలో ఉన్న సమయంలో మన వాళ్లు మన వద్దకు రాకున్నా, స్నేహితుడు కచ్చితంగా మన వద్దకు వస్తాడని, మన కష్టాలను తీర్చేది స్నేహితుడే అని చాలా మంది చెబుతుంటారు. అలాంటి స్నేహితుడే ఇప్పుడు దారుణానికి పాల్పడ్డాడు. నమ్మి వచ్చిన వ్యక్తిని హత్య చేశాడు

ప్రొద్దుటూరులో దారుణం.. నమ్మి వచ్చిన వ్యక్తిని హత్య చేసిన స్నేహితుడు
New Update

ఆపద వచ్చినప్పుడు స్నేహితుడే తమను ఆదుకుంటాడని ఎవరైనా అనుకుంటారు. కానీ ప్రొద్దటూరులో ఓ వ్యక్తి తన స్నేహితుడినే హత్య చేశాడు. మరో కంటికి తెలియకుండా ఇసుకలో పూడ్చిపెట్టాడు. ఈ సంఘటన బయటపడటంతో నివ్వెరపోవడం అందరి వంతయ్యింది.

కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణం చోటు చేసుకుంది. సతీష్‌ అనే వ్యక్తిని తన స్నేహితుడు కిషోర్‌ హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ఇసుకలో పూడ్చిపెట్టాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల భారీ వర్షాలకు ఇసుక నుంచి దుర్వాసన రావడంతో గమనించిన సానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఇసుకలో మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. మృతుడు సతీష్‌గా గుర్తించారు. గత నెల నుంచి సతీష్‌ తన స్నేహితుడు కీషోర్‌తో కలిసి ఉంటున్నట్లు స్థానికులు తెలపడంతో.. పోలీసులు కిషోర్‌ను అదుపులోకి తీసుకొని తమదైన స్టైల్లో విచారించగా అసలు విషయం బయటపడింది.

సతీష్‌ నెల క్రితం ఇంట్లో గొడవపడి ప్రొద్దుటూరులోని తన స్నేహితుడు కిషోర్‌ ఇంటికి వెళ్లాడని పోలీసులు తెలిపారు. ఇరువురు స్నేహితుల మధ్య చిన్న గొడవ జరిగిందని, అది చిలికి, చిలికి గాలివానగా మారిందని, ఆక్రమంలో కిషోర్‌ క్షణికావేశంతో కర్రతో సతీష్‌ తలపై బలంగా మోదాడని, దీంతో సతీష్‌ అక్కడికక్కడే మృతి చెందాడని పోలీసులు తెలిపారు. మరోవైపు కిషోర్‌ సతీష్‌ను క్షణికావేశంతో కొట్టి హత్య చేశాడా..? లేక పాత కక్షలను మనస్సులో ఉంచుకొని హత్య చేశాడా అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

కిషోర్‌, సతీష్‌ చిన్న తనం నుంచి కలిసి పెరిగారని, ఇద్దరు ఒకే స్కూలు, ఒకే కాలేజీలో చదువుకున్నారని మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు. ఇరువురు ఒకే కంచంలో తిని ఒకే మంచంలో పడుకునేంతగా వారి మధ్య సన్నిహిత్యం ఉండేదని, అలాంటి వ్యక్తి ఈ హత్య చేశాడంటే నమ్మశక్యం కాకుండా ఉందన్నారు.

#satish #kadapa-district #proddutur #friend #killed #kishore
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe