ప్రకాశం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న ఇల్లాలిని అనుమానంతో కలువలోకి తోసి చంపేశాడు ఓ భర్త. ఈ సంఘటన పుల్లల చేరువు మండలం సిద్దన్నపాలెంలో జరిగింది. వివరాల్లోకి పోతే.. పుల్లలచెరువు మండలం సిద్దిన్న పాలానికి చెందిన పూజల బసన కోటేశ్వరి మరియు శ్రీను ఇద్దరు భార్య భర్తలు. గత కొద్ది రోజులుగా భర్త శ్రీను, భార్య బసన కొటేశ్వరిపై అనుమానం పెంచుకోవడంతో ఇంట్లో కుటుంబ కలహాలు మొదలయ్యాయి. భార్యను ఎలాగైనా చంపేయ్యలనే ఉద్దేశంతో సాగర్ కాలువలో నీళ్లు వచ్చాయి చూసొద్దామని నమ్మబలికి బైక్‌పై తీసుకొని పోయాడు. భర్త మాటలకు నమ్మి భార్య బసన కొటేశ్వరి సాగర్ కాలువ దగ్గరికి పోయింది. ఒక్కసారిగా సాగర్ కాలువలోకి భర్యను నెట్టివేయడంతో నీటి ప్రవాహానికి కాలువలో కొట్టుకొని పోయింది.
This browser does not support the video element.
విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు తమ కూతుర్ని భర్త శ్రీను సాగర్ కాలవలో నెట్టేసి చంపేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరికి ఇద్దరు సంతానం ఉండడంతో తల్లి లేని అనాదలుగా పిల్లలు మారారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సాగార్ కాలులో ముమ్మరంగా గాలించి విశ్వానాదపురం గేట్ల దగ్గర మృతదేహాన్ని కనుగొన్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని యర్రగొండపాలెం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. నిందితుడు శ్రీనును పోలీసులు పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంలో వాసవి మాత
నిన్న తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలంలో భార్యపై అనుమానంతో భార్యను కత్తెరతో పొడిచిన విషయం తెలిసిందే. చిట్యాల గ్రామానికి చెందిన మొయ్యేటి చంద్రమోహన్‌కు చేబ్రోలుకి చెందిన మేరీతో ఏడేళ్ల కిందట వివాహమైంది. వారికి బాబు, పాప ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరి మధ్య కొద్ది రోజుల నుంచి భార్యపై అనుమానించి నిత్యం గొడవ పడుతున్నాడు. నిన్న చంద్రమోహన్ ఇంట్లో ఉన్న కత్తెరతో మేరీ పొట్ట, వీపు, చేతిపైన పొడిచాడు. అనంతరం తాను ఆత్యహత్యాయత్నం చేసుకున్నాడు. గమనించిన స్థానిక ప్రజలు 108లో ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి, ప్రథమ చికిత్స చేసి పరిస్థితి విషమంగా ఉండటంతో రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇది కూడా చదవండి: ప్రజాఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్..భారీ ఏర్పాట్లు చేసిన జిల్లా కేంద్రం