AP Politics: ఏపీలో అధికార పార్టీ చేస్తున్న అరాచకాలపై యుద్దం ప్రకటించాయి టీడీపీ(TDP), జనసేన(Janasena) పార్టీలు. జగన్(Jagan) చేస్తున్న ప్రజా వ్యతిరేక పాలన పై ఉమ్మడి పోరుకు సిద్దం అయ్యాయి. జనసేన, టీడీపీ రాష్ట్ర స్థాయి 2వ ఉమ్మడి సవన్వయ కమిటీ సమావేశం విజయవాడలో ఈ రోజు జరిగింది. టీడీపీ నుండి ఆరుగురు సభ్యులు, జనసేన నుండి ఆరుగురు సభ్యులు సమావేశానికి హాజరయ్యారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌తో(Lokesh) పాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchannaidu), జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) రెండు పార్టీల నుంచి హాజరయ్యారు. ఈ సందర్భంగా గత నెల 23న జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, వాటిని ఏ విధంగా ఉమ్మడిగా నిర్వహించామనే అంశంపై రెండు పార్టీల నేతలు మొదటగా చర్చించారు. ఉమ్మడి జిల్లాల వారీగా జరిగిన సమావేశాలకు మంచి స్పందన వచ్చిందని ఇరు పార్టీల నేతలు చెప్పారు.
Also Read: విద్యార్థులకు GOOD NEWS.. సెలవులు పెంపు!
ఇదిలా ఉండగా.. జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ఆయన మాట్లాడుతూ.. ప్రతీ 15 రోజులకు ఒకసారి జేఏసీ సమావేశాలు నిర్వహిస్తామని అన్నారు. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకూ కలిసి పనిచేయాలని జనసేన-టీడీపీ నిర్ణయం తీసుకున్నాయని వెల్లడించారు. ఈ నెల 14,15,16 తేదీల్లో నియోజకవర్గాల వారీగా ఆత్మీయ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 13న మేనిఫెస్టో కమిటీ సమావేశంలో.. మేనిఫెస్టోలో భవిష్యత్తుకు గ్యారంటీకు అదనంగా జనసేన పథకాలను జతపరచనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో నెలకొన్న కరువుపై ఉమ్మడి కార్యాచరణ, రైతులకు ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేవరకూ, రోడ్లు, మద్యం, విద్యుత్ ఛార్జీల పెంపు, ఇసుక పై ఇలా ప్రతీ 15 రోజులకు ఒక సమస్యపై ఉద్యమం చేస్తామని అన్నారు.
Also Read: మంత్రి కేటీఆర్‌కు ప్రమాదం.. గాయాలు..!