Prisoners: దేశంలో పెరుగుతున్న ఖైదీల మరణాలు.. 2023లో 561 మంది బలి

జైలు శిక్ష అనుభవిస్తున్న వారిలో ఏటా మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఎన్‌సీఆర్‌బీ (NCRB) నివేదిక ప్రకారం ఒక్క 2023 లోనే ఏకంగా 561 మంది ఖైదీలు మరణించారు. ఈ ఖైదీల మరణాల సంఖ్య పెరగడానికి పలు కారణాలతో పాటు కోర్టులు విధించిన మరణ శిక్షలు కూడా ఉన్నాయి.

New Update
Prisoners: దేశంలో పెరుగుతున్న ఖైదీల మరణాలు.. 2023లో 561 మంది బలి

జైల్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల సంఖ్య ఏటా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఎన్‌సీఆర్‌బీ (NCRB) నివేదిక ప్రకారం ఒక్క 2023 లోనే ఏకంగా 561 మంది ఖైదీలు మరణించారు. 19 ఏళ్లలో ఇంతమంది ఖైదీలు మరణించడం ఇదే తొలిసారి. అయితే 2004లో 563 ఖైదీలు మరణించారు. ఈ ఖైదీల మరణాల సంఖ్య పెరగడానికి పలు కారణాలతో పాటు కోర్టులు విధించిన మరణ శిక్షలు కూడా ఉన్నాయి. 2023లో ట్రయల్ కోర్టులు 120 మరణ శిక్షలను విధించిందనట్లు ఢిల్లీకి చెందిన 'నేషనల్ లా యూనివర్శిటీ' తన నివేదికలో తెలిపింది. ఇక మిగిలినవి గతంలో పెండింగ్‌లో ఉన్న మరణశిక్షలను ఈ ఏడాది విధించినట్లు పేర్కొంది.

Also read: త్వరలో మెగా డీఎస్సీ.. జాబ్‌ క్యాలెండర్‌: భట్టి విక్రమార్క

హత్యాచారం చేసినవారికే ఎక్కువగా మరణశిక్షలు

అయితే 2016లో మరణశిక్షల సంఖ్య 156 మాత్రమే ఉంది. 2023 చివరినాటికి 488 ఖైదీలకు సంబంధించి 303 కేసులు హైకోర్టుల ముందు పెండింగ్‌లో ఉన్నాయి. లైగింక నేరాలకు సంబంధించిన కేసుల్లోనే ఎక్కువగా ట్రయర్ కోర్టులు మరణశిక్షలు విధిస్తున్నాయి. 2023లో మరణశిక్ష విధించిన దోషుల్లో 64 మంది హత్యాచారం పాటు లైంగిక నేరాలకు పాల్పడ్డవారే ఉన్నారు. దాదాపు 75 శాతం కేసుల్లో.. 12 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న వారిపై హత్యాచారానికి పాల్పడ్డ దోషులకు కోర్టులు మరణశిక్ష విధించాయి.

అప్పిలేట్‌ కోర్టుల ద్వారా తక్కువ శిక్షలు

గత ఏడాది కూడా 2020 నుంచి హైకోర్టుల ద్వారా మరణ శిక్ష విధించిన కేసులు తక్కువగా ఉన్నాయి. ఇక 2000 ఏడాది నుంచి అప్పిలేట్‌ కోర్టుల ద్వారా మరణ శిక్ష విధించిన వాటిలో 2023లోనే తక్కువ కావడం గమనార్హం. 2023లో అప్పిలేట్‌ కోర్టుల ద్వారా లైంగిక నేరాల కేసుల్లో మరణ శిక్షను ఎదుర్కొన్నవారు చాలా తక్కువ. అయితే ట్రయల్‌ కోర్టుల్లో సరైన విచారణ, ఆధారాలు లేకుండా మరణ శిక్షలు విధిస్తుండటంపై సుప్రీంకోర్టు, హైకోర్టులు ఆందోళన వ్యక్తం చేశాయి.

అర్థవంతమైన శిక్షలు విధించేలా 

నిందితులకు శిక్ష విధించే సమయంలో అప్పిలేట్ కోర్టుల్లో సరైన సమాచారం లేకపోవడంపై ఓవైపు ఆందోళన పెరుగుతుండగా.. మరోవైపు 2023లో ట్రయర్‌ కోర్టులు.. అవసరమైన నివేదికలు సేకరించకుండానే 87 శాతం కేసుల్లో మరణ శిక్షలు విధించాయి. ఇది ట్రయల్ కోర్టులు.. అప్పిలేట్‌ కోర్టుల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చూపిస్తోంది. అయితే 2022లో సుప్రీంకోర్టు.. అర్థవంతమైన మరణశిక్షలు విధించేందుకు మార్గదర్శకాలు రూపొందించాలని రాజ్యాంగ ధర్మాసనానికి సూచించింది.

Also Read: ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్స్ మోసాలను అరికట్టడానికి ఆర్బీఐ చర్యలు 

Advertisment
తాజా కథనాలు