ICC World Cup 2023: వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో భారత్‌ గెలిస్తే రూ.100 కోట్లు పంచుతా.. ఎవరన్నారంటే..

ఆదివారం జరగనున్న వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే.. రూ.100 కోట్లు తమ కంపెనీ కస్టమర్లకు పంచుతానని.. ఆస్ట్రాలజీ కంపెనీ ఆస్ట్రోటాక్ సీఈవో పునీత్‌ గుప్తా ప్రకటించారు. ఇందుకు సంబంధించి తన సోషల్ మీడియా ఖాతాలో ఈ విషయాన్ని పోస్టు చేశారు.

New Update
ICC World Cup 2023: వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో భారత్‌ గెలిస్తే రూ.100 కోట్లు పంచుతా.. ఎవరన్నారంటే..

ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ఆదివారం వరల్డ్‌ కప్ ఫైనల్‌ మ్యాచ్‌ జరగనున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ మ్యాచ్‌ వీక్షేందుకు కోట్లాదిమంది అభిమానులు వెయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు రెండుసార్లు వరల్డ్‌ కప్‌ గెలిచిన టీమ్ఇండియా మూడోసారి కూడా ప్రపంచ కప్పును దక్కించుకునేందుకు గట్టి పట్టుదలతో ఉంది. టీమిండియా గెలవాలని కొంతమంది పూజలు కూడా జరిపిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో తాజాగా ఆస్ట్రాలజీ కంపెనీ ఆస్ట్రోటాక్ సీఈవో పునీత్‌ గుప్తా.. తమ కస్టమర్లకు బంపర్ ఆఫర్‌ ప్రకటించారు. వరల్డ్‌ కప్‌ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే.. 100 కోట్ల రూపాయలకు పంచుతానని ప్రకటన చేశారు. ఈ ఆఫర్‌ను ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు.

Also read: టెన్షన్‌..టెన్షన్.. ఆ ఒక్క మార్పుతో భారత్‌ జట్టు? ప్లేయింగ్‌ ఎలెవన్‌ ఇదే..!

'2011లో ఇండియా వరల్డ్‌ కప్‌ గెలిచినప్పుడు నేను కాలేజీలో చదువుకుంటున్నా. మ్యాచ్‌ జరిగే రోజున మా స్నేహితులతో కలసి ఆడిటోరియంలో మ్యాచ్‌ చూశా. మ్యాచ్‌ జరుగుతున్నంత సేపు మాకు టెన్షనే ఉంది. చివరికి ఇండియా వరల్డ్‌ కప్‌ గెలిచాక సంతోషంతో ఆ రోజున ఎంజాయ్ చేశాం. నా జీవితంలో అత్యంత ఆనంద క్షణాల్లో అది ఒకటి. ఇప్పుడు భారత జట్టు మళ్లీ ఫైనల్‌కు చేరింది. అయితే ఈ మ్యాచ్‌లో ఇండియా గెలిస్తే ఏం చేయాలా అని చాలా సేపు ఆలోచించా.. ఇప్పుడు మా ఆస్ట్రోటాక్‌ యూజర్లంతా నా ఫ్రెండ్సే ఉన్నారు. వాళ్లతో కలిసి ఆనందాన్ని పంచుకోవాలని ఉంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే.. మా సంస్థ వినియోగదారులందరికీ రూ.100 కోట్లను పంచాలని నిర్ణయం తీసుకున్నా. టీమిండియా గెలవాలని కోరుకుందాం అంటూ పునిత్‌ తన పోస్టులో' వివరించారు.

Advertisment
తాజా కథనాలు