Covishield Vaccine: కోవిషీల్డ్‌తో సైడ్‌ ఎఫెక్ట్స్‌.. అంగీకరించిన ఆస్ట్రాజెనెకా

కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు అన్ని దేశాలు రకరకాల వ్యాక్సిన్‌లను అందించింది. బ్రిటీష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనికా కూడా కోవిడ్ వ్యాక్సిన్‌ను అందించింది. అయితే ఇప్పుడు తాజాగా ఈ వ్యాక్సిన్ వల్ల దుష్ప్రభావాలు వస్తున్నాయని చెబుతోంది.

New Update
Covishield Vaccine:  కోవిషీల్డ్‌తో సైడ్‌ ఎఫెక్ట్స్‌.. అంగీకరించిన ఆస్ట్రాజెనెకా

Covishield Can Cause Side Effects: ప్రపంచాన్ని అంతా వణికించిన మహమ్మారి కోవిడ్. దాదాపు మూడేళ్ళ పాటూ మనుషులు చావు భయంతో బతికారు. ఎంతో మంది కరోనా వైరస్ (Corona Virus) బారిన పడి మరణించారు కూడా. చాలా మందిఇ కోవిడ్ వ్యాక్సిన్ రక్షించింది. కరోనా బారిన జనాలను రక్షించేందుకు అన్ని పెద్ద దేశాలు అప్పటి కప్పుడు వ్యాక్సిలను తయారు చేశాయి. మొదటి వేవ్‌లో తగిలిన దెబ్బలకు రెండో వేవ్‌ సమయానికి వ్యాక్సిలను అందుబాటులోకి తీసుకువచ్చాయి. అమెరికా, భారత్, బ్రిటన్ ఇలా చాలా దేశాలు వ్యాక్సిన్‌సు అప్పటికప్పుడు తయారు చేశాయి. బ్రిటన్ ఫార్మా కంపెనీ అస్ట్రాజెనికా కూడా కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేసి అన్ని దేవాలకూ స్లై చేసింది. ఇది గడిచి రెండేళ్ళు దాటిపోయింది. అయితే ఇప్పుడు నెమ్మదిగా ఈ వ్యాక్సిన్లలో ఉన్న లోపాలు బయటపడుతున్నాయి. ప్రపంచ వ్యప్తంగా వ్యాక్సిన్ దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయి. అస్ట్రాజెనికాలో (AstraZeneca) కూడా లోపాలు ఉన్నాయని ఒప్పుకుంటోంది కంపెనీ.

గడ్డ కడుతున్న రక్తం..

అస్ట్రాజెనికా వ్యాక్సిన్ కారణంగా బ్లాట్ క్లాట్స్, తక్కువ ప్లేట్‌లెట్ కౌంట్‌కు దారితీసే అవకాశం ఉందని వ్యాక్సిన్ తయారీదారు వెల్లడించింది. ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ అభివృద్ధి చేసిన కోవిషీల్డ్, సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాచే ఉత్పత్తి చేసింది. దీనిని మన దేశం మొత్తం ఉపయోగించింది. కోవిషీల్స్‌ వల్ల జనాలు థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ అనే సిండ్రోమ్‌కు గురవుతున్నారు. దీని కారణంగా శరీరంలో రక్తం గడ్డ కట్టడం లేదా ప్లేట్‌లెట్స్ కౌంట్ వేగంగా పడిపోవడం జరుగుతోంది. శరీరంలో రక్తం గడ్డకట్టడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ లేదా కార్డియాక్ అరెస్ట్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి.

చాలా కేసులు నమోదు..

ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్‌ తమకు నష్టం కలిగించింది యూకేలో దాదాపు 51 మంది బాధితులు అక్కడి హైకోర్టులో పిటిషన్ వేశారు. తమకు 100 మిలియన్ పౌండ్ల నష్టపరిహారం ఇప్పించాలని వారు అందులో కోరారు. మొట్టమొదటిసారిగా జామీ స్కాట్ అనే బ్రిటీష్ వ్యక్తి ఆస్ట్రాజెనెకాపై కేసు పెట్టాడు. జామీ స్కాట్ థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ సమస్యతో బాధపడుతున్నారు. అతని తర్వాత కూడా చాలా మంది ఈ వ్యాక్సిన్ మీద కేసులు వేయడం మొదలుపెట్టారు. మొదట్లో వీటిన్నింటినీ కంపెనీ వ్యతిరేకించింది కానీ ఈ ఏడా మొదట్లో మాత్రం ఈ కోవిషీల్డ్ వ్యాక్సిస్ వల్ల దుష్ప్రభావాలు వస్తున్నాయని అంగీకరించింది.

Also Read:Amith Shah: యూనిఫామ్ సివిల్ కోడ్‌ను అమలు చేస్తాం- అమిత్ షా

Advertisment
తాజా కథనాలు