AP Pollution Control Board : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఉద్యోగ ప్రకటన వెలువడింది. ఇప్పటికే రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు.. వరుస నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నుంచి తాజాగా నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఇన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ (Assistant Environmental Engineer) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తిగల అభ్యర్థులు కింద సూచించిన విధంగా అప్లై చేసుకోవాలని సూచించింది.
మొత్తం ఖాళీలు:
అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ : 21
విద్యా అర్హతలు:
బ్యాచిలర్ డిగ్రీ(సివిల్/మెకానికల్/కెమికల్/ఇన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణుత సాధించి ఉండాలి.
వయసు :
18 నుంచి 2024 జనవరి 7 నాటికి 42 ఏళ్లు ఉండాలి.
అప్లికేషన్ :
ఆన్‌లైన్ విధానంలో 2024 జనవరి 30 నుంచి ఫిబ్రవరి 19 వరకు దరఖాస్తులు సమర్పించాలి. అప్లికేషన్ ఫీజు రూ.250, పరీక్ష ఫీజు రూ.120 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు రూ.120 నుంచి మినహాయింపు ఉటుంది.
పరీక్ష తేదీ:
2024 ఏప్రిల్ లేదా మే.. లో నిర్వహిస్తారు.
ఇది కూడా చదవండి : NTPC Jobs:ఎన్టీపీపీలో 100 ఇంజనీరింగ్ ఉద్యోగాలు
ఎంపిక విధానం:
రాత పరీక్ష, కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.57,100 - రూ.1,47,760 చెల్లిస్తారు.
మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ ను సంప్రదించండి : https://psc.ap.gov.in/