Kishan Reddy: రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలు ఒకే సారి ఉండవు

తెలంగాణలో ఎన్నికలు షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతాయని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి తెలిపారు. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది పార్లమెంట్‌ ఎన్నికలు ఉంటాయని కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు.

Kishan Reddy: రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలు ఒకే సారి ఉండవు
New Update

తెలంగాణలో ఎన్నికలు షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతాయని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇంచార్జి ప్రకాష్ జవదేకర్‌తో భేటీ అయిన ఆయన.. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కిషన్‌ రెడ్డి.. రాష్ట్రంలో ఎన్నికలపై క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలు ఒకే సారి జరగవన్నారు. రాష్ట్రంలో పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికలు ఒకే సారి జరుగుతాయని చాలా మంది అనుకుంటున్నారని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

మరోవైపు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రజలు ముందుకు వెళ్తుందని తెలిపారు. గ్రామస్థాయిలో బీజేపీ నేతలు బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతి గురించి వివరించి వారికి వాస్తవాలు తెలిజేయాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్సీ కవిత చేసిన అవినీతి గురించి వివరిస్తామన్నారు. కేసీఆర్‌ కాళేశ్వరం నిర్మించడంలో అవినీతికి పాల్పడ్డారని కిషన్‌ రెడ్డి విమర్శించారు. రైతులకు 24 గంటల విద్యుత్‌ ఇస్తూ అందులో కూడా అవినీతికి తెరలేపారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను సీఎం గత 9 ఏళ్లలో అప్పుల రాష్ట్రంగా మార్చారని విమర్శించారు.

బీఆర్‌ఎస్‌ అంటేనే అవినీతి పార్టీగా మారిపోయిందన్న కిషన్‌ రెడ్డి.. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలందరూ అవినీతి పరులుగా మారారన్నారు. బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు చేయని అవినీతి లేదన్నారు. ఇసుకను అక్రమంగా తరలిస్తూ కోట్లు గడిస్తున్నారన్నారు. రైతుల భూమిని లాక్కొని కార్పోరేట్‌ సంస్థలకు అప్పగిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల గురించి వారి వారి నియోజకవర్గాల్లో తెలియజేస్తామని, బీజేపీ అధికారంలోకి వచ్చాక చేసే అభివృద్ధి కార్యక్రమాల గురించి సైతం వివరిస్తామని ఎంపీ కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు.

#elections #bjp #meeting #plan #kishan-reddy #prakash-javadekar
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe