India VS Bangladesh: ఆసియా గేమ్స్ లో టీమ్ ఇండియా పురుషుల జట్టు తమ హవా కొనసాగిస్తోంది. మొట్ట మొదటి సారి ఇండియన్ క్రికెట్ టీం ఆసియ క్రీడలు 2023 సెమీ ఫైనల్స్ లో బంగ్లాదేశ్ పై విజయం సాధించి ఫైనల్స్ కు చేరుకుంది.
ఇండియా Vs బంగ్లాదేశ్ గా ముగిసిన మ్యాచ్ లో.. ఎంతో చాకచక్యంగా ఆడిన ఇండియన్ టీం బంగ్లాదేశ్ పై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ పురుషుల క్రికెట్(Cricket) జట్టు ఆసియా గేమ్స్ 2023 లో ఫైనల్స్ కు చేరుకుంది. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ 97 పరుగులు చేయగా ఆ టార్గెట్ ను భారత్ 9.2 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి బంగ్లాదేశ్ పై విజయం సాధించింది.
ఇక ఈ విజయంతో భారత్ స్వర్ణ పథకాన్నీ అందుకోవడానికి సిద్దమైనట్లే. బరిలోకి దిగిన మొదట్లోనే టీం ఇండియాకు(India) షాక్ తగిలింది. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 96 స్కోర్ చేసింది. భారత బౌలర్లు రెచ్చిపోయి ఆడటంతో బంగ్లాదేశ్ బ్యాటర్లు క్రీజు లో నిలువలేకపోయారు. యువ ఓపెనర్ యశస్వి 4 బంతులు ఆడి క్యాచ్ ఔట్ అయ్యాడు. ఇక నెక్స్ట్ వచ్చిన రుతురాజ్, తిలక్ వర్మ ఇద్దరు కలిసి సిక్స్ లు, బౌండరీ లు బాదీ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లారు. బౌలర్ సాయి కిషోర్ 3 వికెట్లు పడగొట్టాడు. షాబాజ్, తిలక్, అర్షదీప్, రవి బిష్ణోయి ఒక్కొక వికెట్ సాధించారు.
ఇంతక ముందు జరిగిన ఆసియా క్రీడల్లో(Asia Games2023) బంగ్లాదేశ్, శ్రీలంక ఛాంపియన్స్ గా నిలిచాయి. భారత జట్టు మొదటి సారి ఆసియ క్రీడలు 2023 లో ఫైనల్ కు చేరి, ఫైనల్స్ లో తమ సత్తా చాటబోతుంది.
ఆసియ క్రీడలో టైటిల్ ను గెలిచేందుకు ప్రయతిస్తున్న భారత్ శుక్రవారం బంగ్లాదేశ్ Vs ఇండియా మ్యాచ్ ఆడి గెలవగా, ఇక శనివారం జరగబోయే ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ లేదా ఆఫ్ఘనిస్తాన్ తో తలపడనుంది.
Also Read: World cup 2023:వన్డే ప్రపంచకప్‌లో తొలిమ్యాచ్‌లోనే భారత్‌కు షాక్.