Asia Cup 2023: టీమిండియాకు గట్టి షాక్‌..గాయంతో తొలి రెండు వన్డేలకు స్టార్ ప్లేయర్ దూరం!

ఆసియా కప్‌కు ముందు టీమిండియాకు గట్టి షాక్‌ తగిలింది. గాయంతో కేఎల్‌ రాహుల్‌ తొలి రెండు వన్డేలకు దూరం అవుతున్నట్టు హెడ్‌కోచ్‌ ద్రవిడ్‌ అధికారికంగా ప్రకటించాడు. సెప్టెంబర్‌ 2న పాక్‌, సెప్టెంబర్‌ 4న నేపాల్‌పై తలపడే మ్యాచ్‌లకు రాహుల్‌ అందుబాటులో ఉండడం లేదు. అతని స్థానంతో ఇషాన్‌ కిషన్‌ తుది జట్టులోకి వస్తున్నాడు.

Asia Cup 2023: టీమిండియాకు గట్టి షాక్‌..గాయంతో తొలి రెండు వన్డేలకు స్టార్ ప్లేయర్ దూరం!
New Update

Asia Cup 2023: అనుకున్నదే అయ్యింది.. కొత్తగా జరిగిందేది లేదు.. సెలక్షన్ల కమిటీ ఛైర్మన్‌ అజిత్‌ అగార్కర్‌ (Ajit Agarkar) చెప్పిందే హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ (Rahul Dravid) చెప్పాడు. గాయంతో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ (KL Rahul) ఆసియాకప్‌లోని తొలి రెండు వన్డేలకు దూరం అవుతున్నట్టు ఆఫిషియల్‌గా ప్రకటించాడు. రేపటి(ఆగస్టు 30) నుంచి ఆసియా కప్‌ ప్రారంభం అవుతుంది. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌, నేపాల్‌ జట్లు తలపడునున్నాయి. ఇక ఆసియా కప్‌లో టీమిండియా తొలి మ్యాచ్‌ సెప్టెంబర్‌ 2న పాకిస్థాన్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌తో పాటు తర్వాత నేపాల్‌తో జరిగే మ్యాచ్‌లోనూ కేఎల్‌ రాహుల్‌ ఆడడు.



ఎందుకీ తొందరపాటు:

నిజానికి ఆసియాకప్‌కి టీమిండియాని ఎంపిక చేసిన రోజే అజిత్‌ అగార్కర్‌ ఈ విషయాన్ని చెప్పాడు. ఇటివలే గాయం నుంచి కోలుకున్న కేఎల్ రాహుల్‌కి మళ్లీ గాయం అయ్యిందని.. అయితే చిన్న గాయమే కావడంతో తొలి రెండు వన్డేలకు మాత్రమే అందుబాటులో ఉండడని క్లారిటీ ఇచ్చాడు. ఇక అజిత్‌తో పాటు బీసీసీఐ (BCCI) తీరుపై మాజీలు మండిపడ్డారు. సెలక్షన్‌ రోజున ఓ ఆటగాడు ఫిట్‌గా లేడని తెలిసినా కూడా ఎలా ఎంపిక చేస్తారని విమర్శించారు. టీమిండియా మాజీ సెలక్టర్‌ శ్రీకాంత్‌ సైతం ఇదే అంశాన్ని పాయింట్‌ అవుట్ చేస్తూ ఫైర్ అయ్యాడు. ఒక ఆటగాడు గాయంతో ఉంటే జట్టులోకి ఎలా సెలక్ట్ చేస్తారో తనకు అర్థంకాలేదని కౌంటర్లు వేశాడు.



రాహుల్ స్థానంలో ఎవరు?

కేఎల్ రాహుల్ స్థానంలో తుది జట్టులోకి ఇషాన్‌ కిషన్‌ రానున్నాడు. సెప్టెంబర్‌ 2 పాక్‌పై మ్యాచ్‌తో పాటు సెప్టెంబర్‌ 4 నేపాల్‌ మ్యాచ్‌లో ఇషాన్‌ బరిలోకి దిగనున్నాడు. ఇక స్టాండ్‌బైగా ఇప్పటికీ సంజూ శాంసన్‌ని ఎంపిక చేశారు సెలక్టర్లు. ఒకవేళ ఇషాన్‌కి కూడా గాయమైతే సంజూని ఆడిస్తారు. నిజానికి ఆలూరులో జరిగిన ఆరు రోజుల ఫిట్‌నెస్, వైద్య శిబిరానికి రాహుల్ ఆసియా కప్‌లోని మిగిలిన ఆటగాళ్లతో కలిసి హాజరైనప్పటికీ, అతను యో-యో ఫిట్‌నెస్ పరీక్షకు హాజరు కాలేదు. ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో కుడి తొడ గాయం రాహుల్‌ను చాలా కాలం పాటు ఆటకు దూరంగా ఉంచింది. లండన్‌లో శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత బెంగుళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో ఫిట్‌నెస్‌ పొందాడు రాహుల్‌. అయితే మరోసారి గాయం కావడంతో అతను తొలి రెండు వన్డేలకు దూరం కావాల్సి వస్తోంది.



ఆసియా కప్‌కు భారత్‌ జట్టు : రోహిత్ శర్మ(C), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ , ప్రసిద్ కృష్ణ.

బ్యాకప్ - సంజు శాంసన్

ALSO READ: శభాష్ నీరజ్ చోప్రా.. ఆటలోనే కాదు వ్యక్తిత్వంలోనూ బంగారమే

#kl-rahul #asia-cup-2023 #kl-rahul-to-miss-first-two-matches-of-asia-cup #2023-asia-cup #kl-rahul-injury-news #kl-rahul-injury-update #kl-rahul-injury
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe