Asia cup: ఇదెక్కడి రన్‌ అవుట్‌రా బాబు.. ఎంతైనా పాక్‌ కదా.. అశ్విన్‌ కామెంట్స్!

ఆసియా కప్‌ తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ జట్టు చిత్రవిచిత్రంగా రన్‌అవుట్‌లు అవుతుంది. పాకిస్తాన్ బ్యాటర్లు రన్‌ అవుట్ల రూపంలో పెవిలియన్‌కు చేరుతున్నారు. ఓపెనర్ ఇమాముల్ హక్ (5) రన్‌అవుట్ తర్వాత రిజ్వాన్‌ అవుటైన తీరు నెట్టింట తీవ్ర చర్చకు దారి తీసింది. 'త్రో'కి భయపడి రిజ్వాన్‌ గాల్లో ఎగరగా.. అదే సమయంలో నాన్‌స్ట్రైకింగ్‌ ఎండ్‌లోకి దూసుకొచ్చిన బంతి వికెట్లను తాకింది. హెల్మెట్ పెట్టుకోని ఉంటే రిజ్వాన్‌ ఇలా భయపడి గాల్లోకి ఎగిరేవాడు కాదని టీమిండియా స్పిన్నర్‌ అశ్విన్ అభిప్రాయపడ్డాడు.

New Update
Asia cup: ఇదెక్కడి రన్‌ అవుట్‌రా బాబు.. ఎంతైనా పాక్‌ కదా.. అశ్విన్‌ కామెంట్స్!

Asia Cup 2023 : బెసిక్స్‌ మరిచిపోతే ఎలా..? రన్‌ చేసేటప్పుడు గాల్లోకి ఎగురుతారా? ఇదెక్కడి వింత మావా.. పాకిస్థాన్ అంటే అంతే ఉంటుంది మరి.. చిత్ర విచిత్రంగా మిస్‌ ఫీల్డ్‌లు చేయడం.. క్యాచ్‌లు డ్రాప్‌ చేయడం.. అనూహ్యమైన రీతిలో రన్‌అవుట్లు అవ్వడం పాక్‌కి బటర్‌తో పెట్టిన ఎడ్యూకేషన్‌. ఫాస్ట్‌ బౌలర్లకు కేరాఫ్‌ అని అనడంలో ఎలాంటి డౌట్ లేదు కానీ.. క్రికెట్‌లో లేజీనెస్‌ మాత్రం వారికి తరతరాలుగా కొనసాగుతూ వస్తోంది. నాటి ఇంజిమమ్‌ నుంచి నేటి రిజ్వాన్‌ వరకు వెరైటీగా అవుట్‌ అవ్వడంతో పాక్‌కి పాకే సాటే! తాజాగా జరుగుతున్న ఆసియా కప్‌లో పాకిస్థాన్‌ ఓపెనర్‌ రిజ్వాన్‌ అవుటైన తీరు నెట్టింట ట్రెండ్‌ అవుతోంది.


హాఫ్‌ సెంచరీ మీస్‌:
నేపాల్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్‌కు కీలక ఆటగాడు రిజ్వాన్(rizwan) 44 పరుగులతో రాణించాడు. అయితే, విచిత్రమైన రనౌట్(run out) కారణంగా అతని ఇన్నింగ్స్‌కు బ్రేక్‌ పడింది. నేపాల్‌ ఆటగాడు సందీప్‌ లమిచానే వేసిన 23వ ఓవర్‌లో విచిత్రమై రీతిలో రిజ్వాన్‌ అవుట్ అయ్యాడు. లామిచానే వేసిన మునుపటి డెలివరీలో రిజ్వాన్ ఫోర్ కొట్టాడు.. తర్వాతి బంతికి ఆఫ్ సైడ్‌కు టచ్‌ చేసి వేగంగా సింగిల్ కోసం ప్రయత్నించాడు. నేపాల్ ఫీల్డర్, దీపేంద్ర సింగ్ ఐరీ, పాయింట్ నుంచి బంతిని వేగంగా బౌలర్ ఎండ్ వైపు ఉన్న వికెట్లవైపు విసిరాడు. అది కాస్త వికెట్లను గిరాటేసింది. బాల్‌ని చూస్తూ రన్‌ తీస్తున్న రిజ్వాన్‌ 'త్రో'కి బయపడి గాల్లోకి ఎగిరాడు.. బ్యాట్‌ను క్రీజులోకి గ్రౌండ్ చేయలేదు. రిజ్వాన్ గాలిలో ఉండగానే బాల్‌ స్టంప్‌లను తాకింది. దీంతో రిజ్వాన్‌ అవుట్ అయ్యాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.


అశ్విన్‌ ఏం అన్నాడంటే?
భారత స్పిన్నర్ అశ్విన్ ఈ రన్‌ అవుట్‌పై తనదైన శైలీలో స్పందించాడు. రిజ్వాన్‌ హెల్మెట్ పెట్టుకోని ఉండి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదన్నాడు అశ్విన్‌. ‘బౌల‌ర్ త్రో విసిరిన బంతి నుంచి రిజ్వాన్ త‌ప్పించుకోలేక‌పోయాడు. అయితే.. అలాంట‌ప్పుడు చాలామంది వికెట్ కాపాడుకునేందుకు డైవ్ చేస్తారు. కానీ, రిజ్వాన్ అలా చేయ‌లేదు. బంతి ఎక్క‌డ త‌న త‌ల‌కు త‌గులుతుందేమో అనే భ‌యంతో క‌నిపించాడు. అందుకు కార‌ణం ఏంటంటే.. అత‌డు హెల్మెట్ పెట్టుకోలేదు. రిజ్వాన్ స్వీప్ షాట్లు ఆడేందుకు ఇష్ట‌ప‌డ‌తాడు. అయితే.. హెల్మెట్ లేక‌పోవ‌డం అత‌డిని ర‌నౌట్ అయ్యేలా చేసింది’ అని అశ్విన్ ట్వీట్ చేయగా అది కాస్త వైరల్‌గా మారింది. అశ్విన్‌ చెప్పింది నిజమేనని క్రికెట్ ఫ్యాన్స్‌ అంటున్నారు.

Also read: ‘బుక్‌ మై షో’ వాడి అడ్రెస్‌ చెప్పండి భయ్యా.. ఇదెక్కడి వెయిటింగ్‌ టైమ్‌ బాబోయ్!

Advertisment
Advertisment
తాజా కథనాలు