Asia cup: ఇదెక్కడి రన్ అవుట్‌రా బాబు.. ఎంతైనా పాక్ కదా.. అశ్విన్ కామెంట్స్!
ఆసియా కప్ తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు చిత్రవిచిత్రంగా రన్అవుట్లు అవుతుంది. పాకిస్తాన్ బ్యాటర్లు రన్ అవుట్ల రూపంలో పెవిలియన్‌కు చేరుతున్నారు. ఓపెనర్ ఇమాముల్ హక్ (5) రన్అవుట్ తర్వాత రిజ్వాన్ అవుటైన తీరు నెట్టింట తీవ్ర చర్చకు దారి తీసింది. 'త్రో'కి భయపడి రిజ్వాన్ గాల్లో ఎగరగా.. అదే సమయంలో నాన్‌స్ట్రైకింగ్ ఎండ్‌లోకి దూసుకొచ్చిన బంతి వికెట్లను తాకింది. హెల్మెట్ పెట్టుకోని ఉంటే రిజ్వాన్ ఇలా భయపడి గాల్లోకి ఎగిరేవాడు కాదని టీమిండియా స్పిన్నర్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు.