MLA Koneti Adimulam : ఏపీ(AP) లో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ సీఎం జగన్(CM Jagan) కు షాకుల మీద షాకులు ఇస్తున్నారు వైసీపీ పార్టీ(YCP Party) నేతలు. వైసీపీని రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి తీసుకురావాలని సీఎం జగన్ చేస్తున్న ప్రయత్నాలకు వారు అడ్డంకులాగా మారారు. ఎలాగైనా అధికారంలోకి రావాలని సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తున్న సీఎం జగన్ నిర్ణయానికి కొందరు నేతలు అలిగి రాజీనామా బాట పట్టారు. ఎవరు రాజీనామా మేము కేర్ చేయమని వైసీపీ అధిష్టానం స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి : ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. త్వరలో రైతు రుణమాఫీ?
అలిగిన సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం..
వైసీపీ సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సత్యవేడు ఎమ్మెల్యేగా కాదని ఎంపీ టికెట్ కేటాయించడంపై అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలను ఎందుకు ఎంపీలుగా ఎన్నికల బరిలో పంపుతున్నారని ప్రశ్నించారు. వైసీపీలో ఎస్సీలకు గౌరవం లేదని ఆరోపణలు చేశారు. సత్యవేడు నియోజకవర్గ భేటీని మంత్రి పెద్దిరెడ్డి ఇంట్లో పెడుతారా? అని వైసీపీ అధిష్టానాన్ని ప్రశ్నించారు.
మంత్రి పెద్దిరెడ్డి కుట్రలో భాగంగా తనకు టికెట్ రాలేదని ఒక సెల్ఫీ వీడియో(Selfie Video) ను విడుదల చేశారు. చెవిరెడ్డి, కరుణాకర్ రెడ్డి, రోజా స్థానాల్లో ఇలా ప్రకటించగలరా? అని ప్రశ్నించారు. 14 ఏళ్ల పాటు పార్టీకి ఎనలేని సేవ చేశానని ఆవేదన వ్యక్తం చేశారు. సత్యవేడు ప్రజల నుండి తనను దూరం చేసే ప్రయత్నం సరికాదని వెల్లడించారు. దీంతో ఆయన పార్టీ రాజీనామా చేసి జనసేన(Janasena) లో చేరుతారని అక్కడి నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నారట. మరి పార్టీ మారుతారని జరుగుతున్న ప్రచారానికి ఆయన క్లారిటీ ఇస్తారా? లేదా వైసీపీకి రాజీనామా చేసి వేరే పార్టీలో చేరుతారా? అనేది వేచి చూడాలి
ఇది కూడా చదవండి : ఏపీలోనూ బీహార్ మార్క్ రాజకీయం.. బీజేపీ గేమ్ ప్లాన్ ఇదేనా?
DO WATCH: