Kejriwal: సీఎం పదవిలో ఉండగా అరెస్ట్‌ అయిన తొలి ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌!

ముఖ్యమంత్రి పదవిలో ఉండగా అరెస్టైన తొలి ముఖ్యమంత్రి కేజ్రీవాలే. అయితే దేశంలో మరి కొందరు ముఖ్యమంత్రులు పదవి నుంచి వైదొలిగిన తరువాత అరెస్ట్‌ అయ్యారు. వారిలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, చంద్రబాబు నాయుడు,లాలూ యాదవ్‌, హేమంత్‌ సోరెన్‌ ఉన్నారు.

Kejriwal: సీఎం పదవిలో ఉండగా అరెస్ట్‌ అయిన తొలి ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌!
New Update

ఢిల్లీ మద్యం కుంభకోణం (Delhi Liquor Scam) కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ (Kejriwal) ను గురువారం సాయంత్రం ఈడీ (ED) అధికారులు ఆయన నివాసంలో అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి పదవిలో ఉండగా అరెస్టైన తొలి ముఖ్యమంత్రి కేజ్రీవాలే. అయితే దేశంలో మరి కొందరు ముఖ్యమంత్రులు పదవి నుంచి వైదొలిగిన తరువాత అరెస్ట్‌ అయ్యారు.

వారిలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మొదలు.. నిన్న కాక మొన్న అరెస్ట్‌ అయిన జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ వరకు ఉన్నారు.

లాలూ ప్రసాద్‌ యాదవ్‌(బీహార్‌)
బీహార్‌ ముఖ్యమంత్రిగా ఉన్న లాలూ ప్రసాద్‌ యాదవ్‌.. ఆయన పదవిలో ఉన్న సమయంలో దాణా కుంభకోణం ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆయన పదవి నుంచి తప్పుకున్న తరువాత లాలూ యాదవ్‌ తో పాటు.. మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రాలను కూడా కోర్టు దోషులుగా పేర్కొంది. ఈ క్రమంలో అరెస్ట్‌ అయిన లాలూ.. తరువాత బెయిల్‌ పై విడుదల అయ్యారు.

జయలలిత (తమిళనాడు)
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత రాష్ట్రంలో కలర్‌ టీవీల కొనుగోలు వ్యవహారంలో అక్రమాలకు పాల్పడిన కేసులో అరెస్టయ్యారు. అప్పుడు ఆమె నెలరోజులు జైలులో ఉండగా... ఆ తరువాత ఆమె విడుదల అయ్యారు. ఈ క్రమంలోనే ఆమె 2014లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మరోసారి అరెస్ట్‌ అయ్యి జైలుకు వెళ్లారు.

హేమంత్ సోరెన్ (జార్ఖండ్)
జార్ఖండ్ ముక్తి మోర్చా (జెఎంఎం) నాయకుడు హేమంత్ సోరెన్‌ను జనవరి 31న ఇడి తన రాష్ట్రంలో జరిగిన భూ కుంభకోణంపై మనీలాండరింగ్ విచారణకు సంబంధించి అరెస్టు చేసింది. అరెస్టుకు ముందు సోరెన్ తన పదవికి రాజీనామా చేయడంతో పార్టీ సీనియర్ మంత్రి చంపాయ్ సోరెన్‌ను తదుపరి ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది.

మధు కోడా (జార్ఖండ్)
2006 నుండి 2008 వరకు జార్ఖండ్ రాష్ట్రాన్ని నడిపిన అతి పిన్న వయస్కుడైన ముఖ్యమంత్రి మధు కోడా. కోడా సీఎంగా ఉన్న సమయంలో బొగ్గు, మైనింగ్ బ్లాకుల కేటాయింపుల కోసం లంచాలు అందుకున్నారని ఈడీ, సీబీఐ ఆరోపించి ఆయనను అరెస్ట్ చేశాయి.

చంద్రబాబు నాయుడు (ఆంధ్రప్రదేశ్)
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో గతేడాది అరెస్టయ్యారు. ఆయన సీఎంగా ఉన్న సమయంలో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో కోట్లాది రూపాయల కుంభకోణానికి సంబంధించిన కేసులో ఈ అరెస్టు జరిగింది.

ఓం ప్రకాష్ చౌతాలా (హర్యానా)
హర్యానా ముఖ్యమంత్రిగా ఓం ప్రకాష్‌ చౌతాలా పలుమార్లు పని చేశారు. ఈ క్రమంలో ఆయన ఉపాధ్యాయ నియామకాల్లో అక్రమాలకు పాల్పడినట్లు దోషిగా తేలడంతో పదేళ్ల శిక్ష, ఆ తరువాత అక్రమాస్తుల కేసులో మరో నాలుగేళ్లు శిక్ష పడింది.

Also read: ఈడీ, సీబీఐ బీజేపీ చేతిలో బొమ్మలుగా మారాయి…కేజ్రీవాల్‌ అరెస్ట్‌ పై కేటీఆర్‌!

#arrest #ap #ed #cm #jayalalitha #cbn #tamilanadu #kejriwal
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe