Arvind Kejriwal: ఇదొక మురికి ఓటు బ్యాంకు రాజకీయం.. సీఏఏ పై కేజ్రివాల్! లోక్ సభ ఎన్నికల ముందు CAAను కేంద్రం అమలు చేయడంపై ఢీల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఇదొక మురికి ఓటు బ్యాంక్ రాజకీయమంటూ విమర్శించారు. వలసదారులకు పౌరసత్వం ఇస్తే దేశ పౌరుల ఉద్యోగాల పరిస్థితేంటని ప్రశ్నించారు. By srinivas 13 Mar 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Arvind Kejriwal On CAA: లోక్ సభ ఎన్నికల వేళ పౌరసత్వ సవరణ చట్టం(CAA)ను బీజేపీ అమలు చేయడంపై ఢీల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటు బ్యాంకు రాజకీయమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం సీఏఏను అమల్లోకి తెచ్చిందంటూ విమర్శలు గుప్పించారు. మురికి రాజయకీయమంటూ మోడీ సర్కార్ పై మండిపడ్డారు. మురికి ఓటు బ్యాంకు రాజకీయం.. ఈ మేరకు కేజ్రివాల్ మాట్లాడుతూ.. ‘ఇది బీజేపీ (BJP) మురికి ఓటు బ్యాంకు రాజకీయం. పాకిస్థాన్ (Pakistan), బంగ్లాదేశ్ (Bangladesh) నుంచి వచ్చిన వలసదారులకు పౌరసత్వం ఇచ్చి వారికి బీజేపీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో ఆశ్రయం కల్పిస్తుంది. దీనివల్ల భవిష్యత్ లో బీజేపీకి ఓటు బ్యాంకు పెరుగుతుంది. వారి రాజకీయ ప్రయోజనాల కోసమే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం సమస్యలను పరిష్కరించకుండా కేంద్రం సీఏఏ (CAA) గురించి మాట్లాడటం బాధకరం. 2014 కు ముందు భారత్‌కు వచ్చిన వారికి పౌరసత్వం ఇస్తామంటున్నారు. ఇలా తలుపులు తెరిస్తే మిగిలినవారు ఊరుకుంటారా. పెద్ద సంఖ్యలో వలసదారులు భారతదేశంలోకి వస్తారు. 3 దేశాల్లో 30 మిలియన్లకు పైగా మైనారిటీలు నివసిస్తున్నారు. 15 మిలియన్ల మంది భారత్‌కు వచ్చినా వారు ఎక్కడ స్థిరపడతారు. వారికి ఉద్యోగాలు ఎవరు ఇస్తారని ప్రశ్నించారు. ఇది దేశానికి ప్రమాదకరం. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలు ప్రభావితం అయ్యే అవకాశముందంటూ ఆందోశన వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: Kolkata: అతనితో మాకు సంబంధం లేదు.. మమత సంచలన వ్యాఖ్యలు! దేశ పౌరుల పరిస్థితేంటి.. అలాగే ఇప్పటికే బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసదారుల వల్ల అస్సాం ప్రజల భాష, సంస్కృతి ఇబ్బందుల్లో పడ్డాయని తెలిపారు. వలసదారులకు పౌరసత్వం ఇస్తే దేశంలోని యువతకు అందాల్సిన ఉద్యోగావకాశాలు వారికే దక్కుతాయన్నారు. వారికి ఉద్యోగాలు ఇస్తారు, ఇళ్ళు కట్టిస్తారు. మరి మన దేశ పౌరుల పరిస్థితేంటి అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. #lok-sabha-elections-2024 #modi #arvind-kejriwal #caa మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి