Revanth Reddy : ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల వడబోతకు ఏఐ టెక్నాలజీ!

ఇందిరమ్మ ఇళ్ల కోసం అర్హుల నుంచి కాంగ్రెస్‌ ప్రభుత్వం దరఖాస్తులను కోరింది. వచ్చిన దరఖాస్తుల ను ఏఐ టెక్నాలజీని ఉపయోగించి వడపోత కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.

Revanth Reddy : ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల వడబోతకు ఏఐ టెక్నాలజీ!
New Update

Telangana Government : తెలంగాణ(Telangana) కాంగ్రెస్‌ ప్రభుత్వం(Congress Government) ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన 6 గ్యారంటీల హామీలను నెరవేర్చేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే ఎన్నికల సమయంలో ఇచ్చిన మహాలక్ష్మి పథకం(Mahalakshmi Scheme) లో భాగంగా మహిళలకు ఉచిత బస్‌ ప్రయాణం(Free Bus Journey), చేయూత పథకంలో భాగంగా ఆరోగ్య శ్రీ బీమా పరిధిని రూ. 10 లక్షలకు పెంచినట్లు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి(Revanth Reddy) ప్రకటించారు.

వచ్చే నెలలో మరో రెండు హామీలను అమలు చేసేందుకు టీఎస్‌ గవర్నమెంట్‌ సిద్దమయ్యింది. ఈ క్రమంలోనే ఆరు గ్యారంటీల అమలకు ప్రజాపాలన పేరుతో అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. దీనిలో ఇందిరమ్మ ఇళ్ల పథకం(Indiramma Indlu Housing Scheme) కింద స్థలం ఉన్నవారికి ఇల్లు కట్టుకునేందుకు రూ. 5 లక్షల ఆర్థికసాయం అందిస్తామని , అంతేకాకుండా స్థలం లేని వారికి స్థలం కేటాయిస్తామని కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీ ఇచ్చింది.

ఈ క్రమంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 84 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వివరించారు. కొంతమంది అయితే వేరువేరు ప్రాంతాల్లో దరఖాస్తు చేసుకున్నట్లు, ఒకే కుటుంబానికి సంబంధించి ఒకటికి మించి దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఇందుకుగాను ఒక వ్యక్తి రాష్ట్రంలో ఎక్కడెక్కడ అప్లయ్‌ చేశారో తెలుసుకునేందుకు లేటెస్ట్‌ టెక్నాలజీని ఉపయోగించేందుకు సిద్దమయ్యారు.

Also Read : తన ఎమ్మెల్యేలను కొనడానికి బీజేపీ ప్రయత్నించిదంటూ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు

దరఖాస్తుదారుల ఆధార్‌ నంబర్లను ఏఐ(AI) సాంకేతికతను ఉపయోగించి అనుసంధానం చేయాలని భావిస్తున్నారు. అర్హులైన లబ్ధిదారులను మాత్రమే ఉంచి మిగిలిన వారి దరఖాస్తులను రిజెక్ట్‌ చేయనున్నట్లు ఓ అధికారి తెలిపారు. ఒక కుటుంబంలో ఒకరినే మాత్రమే అర్హులుగా ఎంపిక చేయాలని రేవంత్‌ సర్కార్‌ భావిస్తోంది.

అయితే పెళ్లి అయిన తరువాత కూడా ఉమ్మడిగా ఉండే వారికి ఈ నిబంధన ఉండదని అధికారులు తెలిపారు. గ్రామ గ్రామన గ్రామ సభలు నిర్వహించి.. అర్హులను గుర్తించాలని ప్రభుత్వం ఇప్పటికే భావిస్తోంది. ఏడాదికి ఎంతమంది లబ్ధిదారులను ఎంపిక చేయాలి ఎన్ని నిధులు కేటాయించాలి అన్న దాని గురించి మంత్రి వర్గం చర్చలు జరిపి తరువాత ప్రణాళికలు తయారు చేస్తామని అధికారులు తెలిపారు.

Also Read : మైలేజ్‌ ఇవ్వట్లేదని 20 ఏళ్ల తరువాత మారుతి సుజుకీకి ఫైన్‌!

#congress #telangana #revanth-reddy #artificial-intelligence #indiramma-indlu-housing-scheme
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe