ఈ ఏడాది(2023) టెక్నాలజీ పరంగా అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) వాడకం బాగా పెరిగిన ఇయర్ ఇదే. ఏ పని చేసుకోవాలన్న ఇటీవల కాలంలో AI హెల్ప్ తీసుకునే వారి సంఖ్య భారీగా పెరిగింది. ముఖ్యంగా టెక్కీలు AIని ఎక్కువగా యూజ్ చేసుకుంటున్నారు. చాలా మంది తమ ప్రాజెక్టులను AIసాయంతోనే పూర్తి చేస్తున్నారు. ఇటు విద్యార్థులు సైతం తమ సబ్జెక్ట్స్‌కు కావాల్సిన సమాచారం కోసం 'ఏఐ'ని వినియోగిస్తున్నారు. కొంతమంది స్టూడెంట్స్ స్కూల్స్‌లో ఇచ్చే హోం వర్క్స్ సైతం AIతోనే చేయించుకుంటున్నారు. ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా మంది జీవితాల్లో భాగమైపోయింది. తాజాగా దీనికి సంబంధించిన మరో ఆసక్తికర విషయం వెలుగుచూసింది. ఈ ఏడాది వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' నిలిచింది.
'ఏఐ' టాప్:
కాలిన్స్ డిక్షనరీ ప్రకారం 'AI' వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది. 2023 సంవత్సరానికి కాలిన్స్ వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా AI ఎంపికైంది. కాలిన్స్ డిక్షనరీ ప్రకారం ఈ వర్డ్ ప్రధాన సంభాషణగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ప్రచురించిన వెబ్‌సైట్‌లు, వార్తాపత్రికలు, మ్యాగజైన్‌లు, పుస్తకాల నుంచి 20 బిలియన్ల కంటే ఎక్కువ పదాలను కలిగి ఉన్న డేటాబేస్ కాలిన్స్. ఇది రేడియో, టీవీ, రోజువారీ సంభాషణల నుంచి మాట్లాడే పదాలను కూడా తీసుకుంటుంది. ఈ ఏడాది ఎక్కువగా సేర్చ్ చేసిన కాలిన్స్ జాబితాలోని ఇతర పదాలు "నెపో బేబీ," "గ్రీడ్‌ఫ్లేషన్," "బాజ్‌బాల్". బ్యాటింగ్ జట్టు అత్యంత దూకుడుగా ఆడే టెస్ట్ క్రికెట్ శైలని బాజ్‌బాల్ అని పిలుస్తారు. ఇది కివీస్ మాజీ క్రికెటర్ బ్రెండన్ మెకల్లామ్ పేరు మీద కాయిన్ చేశారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మానవ మేధస్సు అవసరమయ్యే పనులను చేయగల కంప్యూటర్ సిస్టమ్‌ల అభివృద్ధిని సూచిస్తుంది. ఈ పనులలో నేర్చుకోవడం, తార్కికం, సమస్య పరిష్కారం, సహజ భాషను అర్థం చేసుకోవడం అవగాహన ఉన్నాయి. AI నిర్దిష్ట పనుల కోసం రూపొందించబడింది . ఇది విస్తృత కార్యకలాపాలలో మానవ మేధస్సును కలిగి ఉంటుంది. అందుకే ఏ పని జరగాలన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై డిపెండ్ అవుతున్నారు ప్రజలు. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా కోట్లలో ఉద్యోగాలు పోతాయని.. అదే సమయంలో అదే స్థాయిలో జాబ్స్ క్రియేట్ అవుతాయన్నది నిపుణుల మాట. అందుకే ఏఐ పట్ల ఫొకస్ పెంచితే ఫ్యూచర్‌కు ఎలాంటి ప్రమాదం ఉండదని.. ఒక జాబ్ పోయినా.. ఇంకో జాబ్ తెచ్చుకోవచ్చని తెలుస్తోంది. ట్రెండ్‌కి తగ్గట్టుగా స్కిల్ పెంచుకుంటే కెరీర్‌కు ఎలాంటి సమస్యలూ ఉండవని చరిత్ర కూడా నిరూపిస్తోంది. AI అడ్వెన్స్‌కి చేరే సమయానికి ఎక్కువగా ప్రభావితమయ్యే ఉపాధి రంగాలలో ఆఫీస్ సపోర్ట్, కస్టమర్ సర్వీస్, ఫుడ్ సర్వీస్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఈ ఫిల్డ్స్‌లో ప్రస్తుతం జాబ్స్ చేస్తున్న వాళ్లు ముందునుంచే జాగ్రత్తగా ఉంటూ.. టెక్ నాలెడ్జ్‌ని అప్‌డేట్ చేసుకోవడం..AIకి సంబంధించి పలు కోర్సులు నేర్చుకోవడం మంచిదని సూచిస్తున్నారు. ఉద్యోగాల మార్పు వల్ల తక్కువ సంపాదన ఉన్నవాళ్లు వేరే వృత్తి రంగాలకు వెళ్లేందుకు కొత్త నైపుణ్యాలను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంటుందని నివేదికలు కూడా స్పష్టం చేస్తున్నాయి.
Also Read: ‘తాత్కాలిక కమిటీ ఏర్పాటు..’ క్రీడా మంత్రిత్వ శాఖ నిర్ణయంతో బీజేపీ ఎంపికి బిగ్ షాక్!
WATCH: