/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/poonam-pandey-1-1-jpg.webp)
Poonam Pandey Fake Death Row : వార్తల్లో నిలవడానికి ఏం చేయడానికైనా వెనుకాడని పూనమ్ పాండే(Poonam Pandey) సర్వైకల్ క్యాన్సర్(Cervical Cancer) రోగులను అవమానపరిచిందన్న విమర్శలు పెరుగుతున్నాయి. చనిపోయినట్టుగా ప్రచారం చేసుకుంటూ తర్వాత చనిపోలేదని పూనమ్ చేసిన నిర్వాకంపై ప్రజలు మండిపడుతున్నారు. పుకార్లు వ్యాప్తి చేసిన పూనమ్ పాండేపై పోలీసు చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర నేత సత్యజిత్ తాంబే(Satyajeet Tambe) డిమాండ్ చేశారు. క్యాన్సర్ బాధితుల బాధలను పూనమ్ జోక్ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. మహారాష్ట్ర(Maharashtra) స్వతంత్ర ఎమ్మెల్యే సత్యజిత్ తాంబే శనివారం పూనమ్ పాండేపై ముంబై పోలీసులు కేసు నమోదు చేయాలని, తద్వారా తమ సొంత పబ్లిసిటీ కోసం ఇలాంటి చర్యలకు పాల్పడే వారికి ఉదాహరణగా నిలుస్తుందన్నారు. గర్భాశయ క్యాన్సర్ అవగాహన ప్రచారంలో భాగంగా తన మరణాన్ని ఫేక్ చేసినట్టు పూనమ్ చెప్పుకొచ్చారు.
పూనమ్ పాండే మరణ వార్తను ప్రచురించిన వార్తా సంస్థలను కూడా ఆయన ప్రశ్నించారు. విషయాలను ధృవీకరించకుండా వార్తా ఏజెన్సీలు ఎలా ప్రచురించాయని నిలదీశారు.
అసలేం జరిగింది?
పూనమ్ బ్రతికే ఉంది. చనిపోలేదు.. స్వయంగా ఆమె తన సోషల్ మీడియా(Social Media) లో ఒక పోస్ట్ పెట్టింది. నేను సర్వైకల్ కాన్సర్ తో చనిపోయానని వార్తలు వస్తున్నాయి. అవన్నీ నిజం కాదు. అలా ఎందుకు చేసామంటే.. చాలామంది మహిళలు ఈ రకమైన కాన్సర్ తో బాధపడుతూ చనిపోతున్నారు. అది నాకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది. వారికి ఈ జబ్బుపై సరైన అవగాహనా లేదు. వారికి అవగాహనా కల్పించడానికే ఇలా చేశాను. ఈ డిసీస్ ఉన్న వారు అంట త్వరగా ఏం చనిపోరు. దానికి కూడా వ్యాక్సిన్ ఉంది. కానీ అది ఉన్నట్లు కూడా చాలా మంది మహిళలకు తెలియదు. వారికి అవగాహనా కల్పించడంకోసమే ఇలా చేయాల్సి వచ్చిందని ఆమె చెప్పుకొచ్చింది. ఏది ఏమైనా పూనమ్ ఇలా చేసినందుకు, సోషల్ మీడియాలో ఆమెపై తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తున్నాయి. పబ్లిసిటీ కోసం మరీ ఇంత దిగజారాలా అంటూ ప్రశ్నిస్తున్నారు. అమె కనుక చనిపోకపోతే వెంటనే అరెస్ట్ చేయాలని నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు.
Also Read: ప్రధాన వికెట్లు ఫట్.. ఆ ఒక్కడిపైనే భారం.. ఏం జరుగుతుందో ఏమో?
WATCh: