Paris : పారా ఒలింపిక్స్‌లో అదరగొట్టిన ఆర్మ్ లెస్ ఆర్చర్ శీతల్ దేవి పారిస్ లో జరుగుతున్న పారా ఒలింపిక్స్‌లో ఆర్మ్ లెస్ ఆర్చర్ శీతల్ దేవి అదరగొట్టింది. మహిళల వ్యక్తిగత కాంపౌడ్ ఓపెన్ ర్యాంకింగ్ రౌంలో అద్భుతమైన ప్రదర్శనతో రెండవ స్థానంలో నిలిచింది. దీంతో ఆమె పదహారవ రౌండ్‌లోకి నేరుగా ప్రవేశించింది. By Manogna alamuru 30 Aug 2024 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి Paralympics 2024 : ఎప్పటిలానే పారా అథ్లెట్ శీతల్ దేవి (Sheetal Devi) తన అద్బుత ప్రదర్శనను కొనసాగిస్తోంది. పారిస్ (Paris) లో జరుగుతున్న పారా ఒలింపిక్స్ (Paralympics) లో ఆర్చరీలో మహిళల వ్యక్తిగత కాంపౌండ్‌లో ఓ పెన్ ర్యాంకింగ్ రౌండ్లో గురి చూసిబాణాలను వదిలింది. దీంతో రుఎంవ స్థానంలో నిలిచిన ఆమే పదహారవ రౌండ్‌లోకి నేరుగా ప్రవేశించింది. శీతల్ 720కి 703 పాయింట్లు సాధించి టర్కీకి చెందిన ఓజ్నూర్ గిర్డి క్యూర్ తర్వాత రెండో స్థానంలో నిలిచింది. ఒజ్నూర్ 704 పాయింట్లతో ప్రపంచ రికార్డు సృష్టించింది. శీతల్ ఈ నెలలో గ్రేట్ బ్రిటన్‌కు చెందిన ఫోబ్ పైన్ ప్యాటర్సన్ నెలకొల్పిన 698 ర్యాంకింగ్ రౌండ్‌లో ప్రపంచ రికార్డును అధిగమించింది. తాజాగా.. శీతల్ ను ఓజ్నూర్ అధిగమించడంతో రెండో స్థానంలో నిలిచింది. ర్యాంకింగ్ రౌండ్‌లో శీతల్‌తో సహా మొదటి నాలుగు స్థానాల్లో ఉన్న ఆర్చర్లు 32 రౌండ్‌లో బై పొందారు. ఇప్పుడు వీరందరూ శనివారం 16వ రౌండ్‌లో పాల్గొంటారు. జమ్మూ –కశ్మీర్‌కు చెందిన 17 ఏళ్ళ శీతల్ చేతుల్లేకుండా జన్మించింది. వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో (World Archery Championships) పతకం సాధించిన మొదటి చేతులు లేని మహిళగా గుర్తింపు పొందింది. ఫోకోమెలియా అనే వ్యాధి కారణంగా చేతులు లేకుండా పుట్టింది శీతల్. ఈ వ్యాధి ఉన్నవారి అవయవాలు అభివృద్ధి చెందవు. కానీ దాన్ని మర్చిపోయేలా ఏదైనా సాధించాలనుకుంది శీతల్. మొదట ప్రోస్థెటిక్ చేతులను అమర్చుకుంది. దాని తర్వాత ఆర్చరీ వైపు దృష్టి సారించింది. శీతల్ పాదాలు, కాళ్ల సహాయంతో బాణాలను సంధిస్తుంది. శీతల్ తన పాదంతో విల్లును పట్టుకునే శైలి ప్రఖ్యాత ఆర్మ్‌లెస్ ఆర్చర్ మాట్ స్టట్జ్‌మాన్‌ను పోలి ఉంటుందని చెబుతున్నారు. పారా ఆసియా క్రీడల్లో ఒకే సీజన్‌లో రెండు బంగారు పతకాలు సాధించి రికార్డ్ సృష్టించింది శీతల్ దేవి. ఈ ఫీట్ సాధించిన తొలి భారతీయ మహిళగా ఆమె చరిత్ర సృష్టించింది. తర్వాత రజత పతకాన్ని కూడా చేజిక్కుంచుకుని మూడో పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. హాంగ్‌జౌలో జరిగిన మహిళల వ్యక్తిగత కంపౌండ్, మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లలో ఆమె బంగారు పతకాలను గెలుచుకుంది. Also Read: Assam: ముస్లిం పెళ్ళి, విడాకుల చట్టాన్ని రద్దు చేసిన అస్సాం #paris #sheetal-devi #paralympics-2024 #arm-less-archer మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి