Govt Jobs : 70 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు తొలగింపు.. ఎక్కడంటే

అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్‌ మిలీ రాబోయే కొన్ని నెలల్లో ఏకంగా 70 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటన చేశారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

New Update
Govt Jobs : 70 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు తొలగింపు.. ఎక్కడంటే

Dismiss To Government Employees : సాధారణంగా ప్రైవేటు కంపెనీ(Private Company) ల్లో గత కొన్ని నెలలుగా లేఆఫ్‌(Lay-Off) ల గురించి వింటున్నాం. ఆర్థిక భారం భరించలేక ముఖ్యంగా ఐటీ కంపెనీ(IT Companies) లు ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. అయితే ప్రభుత్వాలు కూడా ఇలా ఉద్యోగాలు తొలగించడం గురించి ఎక్కుడైనా విన్నారా ?. అయితే ఓ దేశంలో ఇప్పుడు అదే జరుగుతోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్‌ మిలీ రాబోయే కొన్ని నెలల్లో ఏకంగా 70 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటన చేశారు.

Also Read : రూ.40 కోట్లకు అమ్ముడుపోయిన నెల్లూరు జాతి ఆవు..

బ్లూమ్‌బర్గ్(Bloomberg) నివేదిక ప్రకారం.. ప్రభుత్వంపై ఉన్న ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకే అర్జెంటీనా అధ్యక్షుడు ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అర్జెంటీనాలో 35 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరితో పోలిస్తే.. 70 వేల మంది ఉద్యోగులు తక్కువే అయినప్పటికీ కార్మిక యూనియన్ల నుంచి నిరసనలు రావొచ్చని పలువురు అధికారులు చెబుతున్నారు.

అయితే అర్జెంటీనాలో ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వేలాదిమంది కాంట్రాక్ట్‌ ఉద్యోగుల(Contract Employees) ఒప్పందం కూడా మర్చి 31నాటికి ముగియనుంది. వాస్తవానికి గత ఏడాదే ఈ ఒప్పందం ముగిసింది. కానీ పలు కారణాల వల్ల ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని మరో మూడు నెలల పాటు పొడిగించింది. ఇదిలాఉండగా.. అన్యాయమైన తొలగింపులు చేస్తే సహించేది లేదని అక్కడి యూనియన్ నాయకులు హెచ్చరిస్తున్నారు. రాబోయే రోజుల్లో దీనిపై పోరాడతామని చెబుతున్నారు.

Also Read : రెండో దశకు టైమైంది..నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ

Advertisment
తాజా కథనాలు