చాలామందికి కరోనా అనంతరం శ్వాసకోశ సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కరోనా వైరస్ వల్ల ఊపిరితిత్తులు దెబ్బ తినటంతో పాటు, ముక్కు దిబ్బడ, జలుబు వంటి జబ్బులు రావటం చూస్తున్నాం. అయితే.. ఈ విషయంలో మనం ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న సైనసైటిస్ వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా.. ముక్కుదిబ్బడ వంటి సమస్యలతో పాటు జలుబు, దగ్గు , జ్వరం వంటి వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే క్రమం తప్పకుండా వేడినీటిలో అల్లం కలిపి తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. రోజు వేడినీటిలో అల్లం కలిపి తాగితే ఏం జరుగుతుందో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుదాం.
అల్లం నీరు వల్ల ఉపయోగాలు
- అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్లు అధికం
- అల్లం శరీరంలో రోగనిరోధకశక్తి, ఇమ్యూనిటీని పెంచుతుంది
- అల్లం నీరులో విటమిన్ సి, మెగ్నిషియం, ఎన్నో మినరల్స్ ఎక్కువ
- కీళ్ల, ఇతర నొప్పులను తగ్గించే గుణం అల్లానికి పుష్కలంగా ఉంది
- ప్రతీరోజు అల్లం నీరు తాగితే నొప్పుల నుంచి ఉపశమనం
- షుగర్ లెవల్స్ కంట్రోల్ చేయడంలో అల్లం నీరు బెస్ట్
- అజీర్తితో బాధపడుతున్న వారు అల్లం రసాన్ని తాగాలి
- అల్లం దగ్గు, జలుబు, గొంతు నొప్పి నుంచి కోలుకునేలా చేస్తుంది
- అల్లం పొట్టుపై ఉండే విష పదార్థాలు ఆరోగ్యానికి హాని చేస్తాయి
- పొట్టును తీసి వాడికుంటే అరోగ్యానికి మంచిదని వైద్యులు సూచిస్తున్నారు
చలికాలంలో పెరిగే వాయుకాలుష్యం వల్ల జలుబు, దగ్గు, ఆస్తమా, ఇతర శ్వాసకోశ సమస్యలకు ఈ అల్లం నీరు సమస్యలను దూరం చేస్తుంది. విషపూరితమైన గాలి ఆరోగ్యాన్ని తీవ్ర ఇబ్బందికి గురి చేస్తుంది. శారీరక, మానసిక, గొంతు నొప్పి , నీరసం వంటి సమస్యలు ఈ వాయు కాలుష్యం వల్ల ఎక్కువగా వస్తాయి. అందుకు వేటి నీటిలో అల్లం వేసి కొద్దిసేపు ఉడికించి ఆ నీటిని వడకట్టాలి.ఈ అల్లం కషాయంలో కొద్దిగా తేనే వేసుకొని తాగాలి. ఇలా రోజు చేస్తే శరీరంలో ఏమైనా ఇన్ఫెక్షన్లను ఉంటే తగ్గుతాయి. అల్లం టీ తాగినా ఆరోగ్యానికి మంచి ప్రజయోనం ఉంటుంది. ఇలాంటి వ్యాధుల నుంచి బయటపడాలంటే రోజు ఉదయం ఈ డ్రింక్స్‌తో తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదండి: పచ్చికొబ్బరి తింటున్నారా..ఈ విషయాలు తెలుసుకోండి