Pending Challan: పెండింగ్ చలాన్స్ పేటీఎంలో ఇలా చెల్లించండి..!!!

మీ వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లపై పేటీఎంలో చెల్లించుకోవచ్చు. టూవీలర్లు, త్రీ వీలర్లకు 80 శాతం, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కు చెందిన బస్సులకు 90 శాతం, కార్లు, హెవీ మోటార్ వెహికిల్స్‌కు 60 శాతం డిస్కౌంట్ ప్రకటించింది.

Bengaluru:270సార్లు ట్రాఫిక్ రూల్స్ అతిక్రమణ..1.36 లక్షల జరిమానా
New Update

ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే...ట్రాఫిక్ పోలీసులు చలాన్లు విధిస్తారు. వీటిని సకాలంలో చెల్లించనట్లయితే అవి కాస్త పెండింగ్ చలాన్ల లిస్టులో ఉండిపోతుంటాయి. అయితే ట్రాఫిక్ పోలీసులు అప్పుడప్పుడూ పెండింగ్ చలాన్ల చెల్లింపును ప్రొత్సహించేందుకు డిస్కౌంట్లు ప్రకటిస్తుంటారు. తెలంగాణ సర్కార్ మరోసారి పెండింగ్ చలాన్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. దీనికి సంబంధించి జీవో కూడా విడుదల చేసింది. టూవీలర్లు, త్రీ వీలర్లు 80శాతం, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థకు చెందిన బస్సులు 90శాతం కార్లు, హెవీ మోటార్ వెహికల్స్ కు 60శాతం డిస్కౌంట్ ను ప్రకటించింది. వాహనదారులు తమ వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్స్ పై డిస్కౌంట్ తో చెల్లించవచ్చు.

పేటీఎం యాప్ ఉపయోగించవారు ఈజీగా తమ పెండింగ్ చలాన్లను చెల్లించుకునే చాన్స్ ఉంది. మీరు కూడా మీ వాహనాల పెండింగ్ చలాన్లను పేటీఎంలో చెల్లించాలనుకుంటే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.

-ముందుగా మీ స్మార్ట్ ఫోన్లో పేటీఎం యాప్ తెరవండి.

-మీ వివరాలతో లాగిన్ అయినక Recharge & Pay Bills పై క్లిక్ చేయండి.

-ఇప్పుడు Challan పైన క్లిక్ చేయండి.

-Traffic Authority మీద క్లిక్ చేసి Telangana Traffic Police పైన క్లిక్ చేయండి.

- తర్వాత వెహికల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇప్పుడు ప్రొసిడ్ పై క్లిక్ చేయండి.

-మీ వాహనంపై ఉన్న పెండింగ్ చలాన్స్ కనిపిస్తాయి.

- డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, పేటీఎం పోస్ట్ పెయిడ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ ద్వారా పెండింగ్ చలాన్లు చెల్లించుకోవచ్చు.

పేటీఎం వెబ్ సైట్లో కూడా దాదాపు అదే ప్రాసెస్ తో పెండింగ్ చలాన్స్ చెల్లించుకోవచ్చు. ఇక పేటీఎం అనేక రకాల సేవలను అందిస్తోంది. మొబైల్ రీచార్జ్, పోస్ట్ పెయిడ్ బిల్లుల చెల్లింపు, డీటీహెచ్ రీచార్జ్, మెట్రో టికెట్స్, బ్రాడ్ బ్యాండ్ చెల్లింపులు, సిలిండర్ బుకింగ్స్, సినిమా టికెట్ బుకింగ్స్, ఫ్లైట్ టికెట్ బుకింగ్ వంటి సేవలను పేటీఎంలో పొందవచ్చు.

ఇది కూడా చదవండి:  భారత నౌకాదళానికి కొత్త బలం..సముద్రంలో ఎక్కడ దాకున్నా వేటాడుతుంది..!!

#traffic-police #traffic-penalty #traffic-challan #pending-challan #traffic-rules #traffic-challans
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe